Tuesday 27 February 2018

నిమ్మరసం, బ్లాక్ పెప్పర్, సాల్ట్ కాంబినేషన్ లోని అద్భుతమైన ప్రయోజనాలు...!


వేసవిలో ఇన్ఫెక్షన్స్ చాలా త్వరాగా అటాక్ అవుతుంటాయి. కాబట్టి ఇన్ఫెక్షన్స్, వ్యాధులను నివారించుకోవడం కోసం కొన్ని నేచురల్ మార్గాలను కలిగి ఉండటం మంచిది.
ఇన్ఫెక్షన్స్, ఫ్లూ వంటివి నివారించుకోవడం కోసం కొన్ని యాంటీ బయోటిక్స్ ను వాడుతుంటారు, అయితే వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కాబట్టి, నేచురల్ రెమెడీస్ ను ఎంపిక చేసుకుని, వ్యాధులను నివారించుకోవడం మంచిది.
ఇన్ఫెక్షన్స్ నివారణకు మెడిసిన్స్ కంటే ఎఫెక్టివ్ గా పనిచేసే నేచురల్ రెమెడీ ఒకటి ఉంది. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
నిమ్మరసం చాలా ఎఫెక్టివ్ అండ్ పవర్ ఫుల్ ఆస్ట్రిజెంట్ . ఇందులో యాంటీ బ్యాక్టారియల్, యాంటీ వైరల్, ఇమ్యూన్ బిల్డింగ్ లక్షణాలు అధికంగా ఉన్నాయి.ఇంకా బయోఫ్లెవనాయిడ్స్, పెక్టిన్, లెమనిన్, సిట్రిక్ యాసిడ్, మెగ్నీషియం, క్యాల్షియం, మరియు విటమిన్స్ అధికంగా ఉంటాయి.

నిమ్మరసంలో పెప్పర్ మరియు సాల్ట్ మిక్స్ చేసి తీసుకుంటే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ అమేజింగ్ కాంబినేషన్ డ్రింక్ తో అనేక వ్యాధులను నివారించుకోవచ్చు.మరి అవేంటో తెలుసుకోకపోతే ఎలా...?
జలుబు మరియు దగ్గు నివారిస్తుందినిమ్మరసం తీసుకుని, ఒక కప్పు వేడినీటిలో మిక్స్ చేయాలి. లేదా ఒక గ్లాసు వేడి నీటిలో సగం నిమ్మకాయను కట్ చేసి వేసి 10 నిముషాలు అలాగే ఉంచాలి. 10 నిముషాల తర్వాత నిమ్మకాయ ముక్కలు తీసేసి అదే వాటర్లో ఉప్పు, బ్లాక్ పెప్పర్, తేనె మిక్స్ చేయాలి. ఈ కాంబినేషన్ డ్రింక్ తాగడం వల్ల జలుబు, దగ్గు ఎఫెక్టివ్ గా తగ్గుతుంది.
గొంతు నొప్పి :
ఈ వాటర్ ను గోరువెచ్చగా ఉన్నప్పుడు నోట్లో పోసుకుని, గార్గిలింగ్ చేయడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది.
ముక్కుదిబ్బడ నివారిస్తుంది:ఈ కాంబినేషన్ డ్రింక్ ను తాగడం వల్ల ముక్కు దిబ్బడను నివారిస్తుంది. అలాగే ఈ డ్రింక్ కు యాలకలు, దాల్చిన చెక్క , జీలకర్ర కూడా మిక్స్ చేస్తే మంచి ఫ్లేవర్ తో పాటు ముక్కు దిబ్బడ నివారిస్తుంది.

వికారం:ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం మిక్స్ చేసి, బ్లాక్ పెప్పర్ ఒక స్పూన్ వేసి మిక్స్ చేసి తాగాలి. ఈ డ్రింక్ నుండి వచ్చే సువాసన వికారంను తగ్గిస్తుంది, బ్లాక్ పెప్పర్ పొట్టను ప్రశాంత పరుస్తుంది.

బరువు తగ్గిస్తుంది:ఒక గ్లాసు నీటిలో 1/4టీస్పూన్ పెప్పర్ పౌడర్, ఒక స్పూన్ తేనె, 2 స్పూన్ల నిమ్మరసం, కొద్దిగా సాల్ట్ మిక్స్ చేసి రెగ్యులర్ గా తీసుకోవాలి. నిమ్మరసంలో ఉండే ఫాలీ ఫినాల్స్ బరువు తగ్గిస్తుంది, ఇన్సులిన్ లెవల్స్ ను క్రమబద్దం చేస్తుంది.మెటబాలిజంను పెంచుతుంది.

ముక్కులో రక్తం కారడం నివారిస్తుంది:
కొద్దిగా కాటన్ తీసుకుని, నిమ్మరసంలో డిప్ చేసి, ముక్కు దగ్గ పెట్టుకుని వాసన చూడటం వల్ల తలనొప్పి తగ్గుతుంది, ముక్కులో రక్తం కారడం తగ్గుతుంది.

దంతాల నొప్పి తగ్గిస్తుంది:లవంగం నూనె, పెప్పర్, నిమ్మరసం, ఉప్పు మిక్స్ చేసి, నొప్పి ఉన్న పంటి మీద అప్లై చేస్తే దంతనొప్పి నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది.

ఆస్త్మా:ఒక గొన్నెలో నీళ్ళు పోసి వేడి చేయాలి. అందులో 10 మిరియాలు, 15 తులసి ఆకులు, 2లవంగాలు వేసి తక్కువ మంటలో బాగా ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని వడగట్టి, అందులో తేనె మిక్స్ చేసి, నిమ్మరసం, ఉప్పు కలిపి ప్రతి రోజూ తాగితుంటే ఆస్త్మా నుండి ఉపశమనం కలుగుతుంది.
గాల్ స్టోన్ నివారిస్తుందిజీర్ణ రసాలు ఎక్కువ తక్కువ అయినప్పుడు గాల్ స్టోన్స్ ఏర్పడుతుంటాయి. ఇది జీర్ణ వ్యవస్థను బ్లాక్ చేస్తుంది. నొప్పి కలిగిస్తుంది. పెప్పర్, లెమన్, ఆలివ్ ఆయిల్ ను సమంగా తీసుకుని, రోజూ తీసుకుంటే ఫలితం ఉంటుంది.  

Wednesday 5 April 2017

వేప...దాని ఉపయోగాలు...!





    తెలుగువారి ఉగాది వచ్చిందంటే... వేపపువ్వుతో చేసిన పచ్చడి తినందే ఆ పండుగ అసంపూర్ణమే! ఉగాది సందర్భంలో వచ్చే వేపపూలని తినేందుకు ప్రోత్సహించడమే ఈ ఆచారం వెనుక ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తుంది. ఆ వేపపచ్చడి ఎండాకాలంలో రాబోయే అంటురోగాలను శరీరాన్ని సన్నద్ధం చేస్తుంది. అయితే వేపతో మన అనుబంధం కేవలం ఉగాదితో తీరిపోయేది కాదు. వేపకి ఉన్న ప్రయోజనాలు అలాంటివి మరి!

    - వేపని మనం చెట్టుగా కాకుండా దేవతగా భావిస్తూ ఉంటాము. ఆ దేవత మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతాము. అందుకే ఉగాది వంటి సందర్భాలలోనే కాకుండా గ్రామదేవతల జాతర్లలో కూడా వేపమండలు తప్పనిసరిగా పూజలో వినియోగిస్తారు.

    - వేపచెట్టు నుంచి వీచేగాలి, చుట్టుపక్కల వాతావరణాన్ని శుభ్రపరుస్తుందని పెద్దలు చెబుతారు.
    అందుకే అవధూతలు సైతం వేపచెట్లు ఉండే ప్రాంతంలో తిరిగేందుకు ఇష్టపడతారట. వేపచెట్టు కింద నిద్రించేవారు దీర్ఘాయుష్షుతో జీవిస్తారని ఆయుర్వేదం చెబుతోంది.

    - వేప ఆకు, పూలు, బెరడు, కాయలు... ఇలా వేపచెట్టులోని అణువణువూ ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. చరకసంహిత వేపను సర్వరోగనివారిణిగా పేర్కొంటోంది. వేపతో నింబాదితైలం లాంటి అనేక లైపనాలు, తైలాలు, చూర్ణాలను తయారుచేస్తారు.

    - రోజూ క్రమం తప్పకుండా వేపచిగుళ్లని తింటూ ఉంటే షుగర్ వ్యాధి దరిచేరదు.

    - వేపచిగుళ్లని తినడం వల్ల పేగులలో ఉన్న హానికారక సూక్ష్మజీవులు, నులి పురుగులు కూడా చచ్చిపోతాయి.

    - వేపపుళ్లలతో పళ్లు తోముకుంటే పళ్లు, చిగుళ్లు దృఢంగా ఉండటమే కాకుండా... పళ్లు పుచ్చిపోవడం, చిగుళ్ల వెంట రక్తం కారడం వంటి సమస్యలు కూడా దరిచేరవు.

    - వేపలో యాంటీఫంగల్, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. అందుకనే చర్మానికి వేప చేసే మేలు అంతా ఇంతా కాదు. వేపాకులను కాచిన నీటితో కానీ వేపనూనెతో తయారుచేసిన సబ్బులని కానీ రుద్దుకుంటే చర్మవ్యాధులు తగ్గుముఖం పడతాయి, శరీరం దుర్గంధాన్ని నివారిస్తుంది.

    - వేపలో యాంటీవైరల్ సుగుణాలు ఉన్నాయి. అందుకే పొంగు, మశూచి వంటి అంటువ్యాధులు సోకినప్పుడు... రోగులను వేపమండల మీద పడుకోపెట్టేవారు.

    - వేపాకుల గుజ్జుని కనుక తలకి పట్టిస్తే చుండ్రు, పేలులాంటి జుట్టుకి సంబంధించిన సమస్యలు మాయమైపోతాయి.

    - వైద్యుడి సూచనల ప్రకారం వేప చూర్ణాన్ని తీసుకుంటే మూత్రాశయంలో ఇన్ఫెక్షన్లు, అతిమూత్రం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

    - నేతిలో కాచిన వేపాకుని కానీ వేప పండ్లు లేదా ఆకుల గుజ్జుని కానీ మొటిమలు, పుండ్లు మీద రాస్తే ఒకటి రెండు రోజులలోనే ఫలితం కనిపిస్తుంది.

    - వేప పండ్లు, విత్తనాల నుంచి తీసిన నూనె అద్భుతమైన క్రిమిసంహారినిగా పనిచేస్తుంది. ఒకరకంగా ప్రకృతి సిద్ధమైన pesticide, insecticideలలో వేపదే ప్రథమ స్థానం.

    - వేప పూతని ఉగాది పచ్చడిలో వాడటం మనకి తెలిసిందే. దీనిని నింబకుసుమభక్షణం అంటారు. వేపపువ్వు, వేపకాయలు, లేత వేప చిగుళ్లని ఉపయోగించి వంట చేయడం కూడా కొన్ని రాష్ట్రాలలో కనిపిస్తుంది.

    Tuesday 4 April 2017

    ముఖ్యమైన కొన్ని వంటింటి చిట్కాలు...!


    ► టొమాటోలు ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఫ్రిజ్‌లో వెజిటబుల్‌ ట్రేలో వేసేటప్పుడు ఒకదాని మీద ఒకటి పడకుండా పక్కపక్కన పెట్టాలి. అది కూడా ఫొటోలో ఎడమ చేతిలో ఉన్నట్లు కాకుండా కుడి చేతిలో ఉన్న విధంగా బోర్లించినట్లు సర్దుకోవాలి. ఇదే విధంగా ఒక వరుస మీద మరో వరుస వచ్చేటట్లు పేర్చుకుంటే ఒకదాని బరువు మరొకదాని మీద పడకుండా తాజాగా ఉంటాయి.

    ►టొమాటో,ఉల్లిపాయ ఒలవాలంటే వాటిని మరుగుతున్న నీటిలో వేసి తీసి చన్నీటి ధార కింద పెడితే (వాటర్‌ టాప్‌ కింద) త్వరగా ఊడి వచ్చేస్తుంది. టొమాటోలకైతే పదిహేను సెకన్లు, ఉల్లిపాయలైతే రెండు నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది.

    ►ఎండుద్రాక్ష, డ్రైఫ్రూట్స్‌ తరిగే ముందు చాకును చన్నీటితో తడిపితే త్వరగా కట్‌ అవుతాయి.

    ►మాంసం కాని చికెన్‌ కాని మరీ పలుచని ముక్కలుగా కట్‌ చేయాలంటే ఇరవై నిమిషాల పాటు ఫ్రీజర్‌లో పెట్టాలి. ఒక మోస్తరుగా గట్టిపడుతుంది కాబట్టి కట్‌ చేయడం సులభమవుతుంది. సమయం ఆదా ఆవుతుంది.

    ► నిమ్మకాయ నుంచి రసం మొత్తం రావాలంటే కోసే ముందు కాయను కిచెన్‌ ప్లాట్‌ఫాం మీద పెట్టి అరచేత్తో రుద్దాలి. ఇలా చేస్తే కాయ మెత్తబడి పిండిన వెంటనే రసం మొత్తం వచ్చేస్తుంది. రసం తీసే టైం తగ్గుతుంది.

    ►వెల్లుల్లి రేకల పొట్టు త్వరగా రావాలంటే ఒలిచేటప్పుడు ఒకవైపు చాకుతో గాటు పెట్టి చివర నొక్కాలి.

    ► ఎక్కువ రేకలు కావల్సినప్పుడు వేడి నీటిలో వేసి ఒకటి రెండు నిమిషాల తర్వాత నీటిని వంపేసి ఆ గిన్నెను చన్నీటి ధార కింద రేకలకు నీటి వత్తిడి తగిలే విధంగా పెడితే పొట్టు ఊడిపోయి నీళ్ల మీదకు తేలుతుంది.

    ►వంటల వాసన ఇల్లంతా వ్యాపించకుండా ఉండాలంటే వండేటప్పుడు వంటగదిలో తడి టవల్‌ను ఆరేస్తే వాసన టవల్‌కు పట్టేసి గది ఫ్రెష్‌గా ఉంటుంది.

    Sunday 2 April 2017

    ఇన్సూరెన్స్ రిపాజిటరీ ఉపయోగాలు ఏంటి..?

    బీమా ప్రతి ఒక్కరికీ అవసరం. మన దేశంలో దాదాపుగా ప్రతీ ఇంట్లోనూ బీమా కలిగిన వారు తప్పకుండా ఉంటారు. సంపాదన పరుల పేరు మీద కనీసం రెండు పాలసీలకు తక్కువ కాకుండా అయినా ఉంటాయి. ఐదు, పది పాలసీలు కలిగిన వారు కూడా ఉన్నారు. మరి ఇన్నేసి పాలసీ పత్రాలను ఇంట్లో ఉంచుకోవడం భద్రమేనా...? 
    పేపర్ రూపంలో ఉండే పత్రాలను ఇంట్లో జాగ్రత్తపరచడం అన్నది శ్రమే. తడిసినా, చిరిగినా ఇబ్బందే. ఎక్కడైనా తప్పిపోతే క్లెయిమ్ సమయంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒకటికి మించి పాలసీలు కలిగి ఉన్న వారు చిరునామా మారినప్పుడు దాన్ని మార్చుకోవడానికి అన్ని కంపెనీలకు వరుసపెట్టి లెటర్లు రాయాల్సి ఉంటుంది. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారమే ఇన్సూరెన్స్ రిపాజిటరీ (ఐఆర్).

    ఇన్సూరెన్స్ రిపాజిటరీ అంటే...?

    బీమా పత్రాలను పాలసీదారుల తరఫున ఎలక్ట్రానిక్ రూపంలో భద్రంగా ఉంచే సంస్థే ఇన్సూరెన్స్ రిపాజిటరీ. షేర్లను, మ్యూచువల్ ఫండ్ యూనిట్లను, సెక్యూరిటీలను డీమ్యాట్ ఖాతా ద్వారా ఎలక్ట్రానిక్ రూపంలో ఉంచుకున్నట్టే... ఈ ఇన్సూరెన్స్ ఖాతా ద్వారా డిజిటల్ రూపంలో బీమా పత్రాలను దాచుకోవచ్చు. ఒక్కరు ఒక రిపాజిటరీ ఖాతా మాత్రమే కలిగి ఉండాలన్నది నిబంధన. 2013 నుంచి ఈ సేవలు మన దేశంలో అమల్లో ఉన్నాయి.

    ఏఏ సంస్థలు

    ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్ మెంట్ అథారిటీ ఐదు సంస్థలకు రిపాజిటరీ సేవల నిర్వహణకు గాను అనుమతించింది. వీటిలో ఎన్ఎస్డీఎల్ డేటాబేస్ మేనేజ్ మెంట్, సెంట్రల్ ఇన్సూరెన్స్ రిపాజిటరీ లిమిటెడ్, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్స్, క్యామ్స్ రిపాజిటరీ సర్వీసెస్, కార్వీ ఇన్సూరెన్స్ రిపాజిటరీ ఉన్నాయి. తొలిగా సేవలు ప్రారంభించినది మాత్రం క్యామ్స్ రిపాజిటరీ. 
    • NSDL Database Management Limited – www.nir.ndml.in 
    • Central Insurance Repository Limited – www.cirl.co.in 
    • SHCIL Projects Limited– – www.shcilir.com 
    • Karvy Insurance Repository Limited – www.kinrep.com 
    • CAMS Repository Services Limited – www.camsrepository.com

    ఉపయోగాలు ఏంటి..?

    రిపాజిటరీలలో ఈ-పత్రాల రూపంలో దాచుకోవడం వల్ల ఇంట్లో భౌతిక పత్రాలను ఉంచుకునే ఇబ్బంది తప్పుతుంది. ఎన్ని పాలసీలు ఉన్నా... ఒకే ఖాతా ద్వారా అన్నింటినీ నిర్వహించుకోవడం వల్ల సులభంగా ఉంటుంది. అన్ని రకాల జీవిత బీమా, ఆరోగ్య బీమా, సాధారణ బీమా, యాన్యుటీ ప్లాన్లను ఈ రూపంలో భద్రపరచుకోవడానికి అవకాశం ఉంది. 
    నామినీ వివరాలు మార్చుకోవడం, చిరునామా మార్చుకోవడం చిటికెలో పని. ఎన్ని పాలసీలు ఉన్నాగానీ రిపాజిటరీకి సమాచారం ఇస్తే... పాలసీదారుడు తరఫున రిపాజిటరీయే బీమా కంపెనీలకు సమాచారం పంపిస్తుంది. అంటే సేవల్లో వేగం పెరుగుతుంది. పాలసీ పత్రం పోతుందన్న భయం ఉండదు. అన్ని రకాల పాలసీలకు ఒకటే వేదిక అవుతుంది. పరిహారం సమయంలో తప్పితే బీమా కంపెనీ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఖర్చులు తగ్గడం వల్ల ప్రీమియం కూడా తగ్గుతుందన్నది ఐఆర్డీఏ చెబుతున్న మాట.

    చార్జీల సంగతి..?

    ఖాతా తెరిచేందుకు, ఖాతాలో బీమా పత్రాలను దాచుకున్నందుకు గాను ఎటువంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అన్ని సేవలు ఉచితం. ప్రస్తుతం పత్రాల రూపంలో ఉన్న బీమా పాలసీలను ఎలక్ట్రానిక్ రూపంలో మార్చుకునేందుకు కూడా చార్జీలు లేవు. ఇన్సూరెన్స్ కంపెనీలే కొంత చార్జీలను రిపాజిటరీ సంస్థలకు చెల్లిస్తాయి. అయితే, భవిష్యత్తులో ఈ ఖాతాలపై నిర్వహణ చార్జీలు, సేవల (చిరునామా, నామినీ తదితర వివరాల మార్పు) చార్జీలు చెల్లించాల్సి రావచ్చు.

    పాలసీ తీసుకోవడం సులభం

    ఇన్సూరెన్స్ రిపాజిటరీ ఖాతా ఉంటే కొత్తగా పాలసీ తీసుకోవడం చాలా సులభం. కొత్త పాలసీ దరఖాస్తులో రిపాజిటరీ ఖాతా నంబర్ వేస్తే సరిపోతుంది. పాలసీ పత్రం కూడా వేగంగా జారీ అవుతుంది. కేవైసీ (మీ కస్టమర్ గురించి తెలుసుకోండి) నిబంధనలు కూడా రిపాజిటరీ ఖాతా ప్రారంభంలో పాటించి ఉంటారు కనుక కొత్త పాలసీ సమయంలో వేరే ఇతరత్రా పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదు.

    ప్రస్తుత పత్రాలను ఈ పత్రాలుగా మార్చుకోవడం ఎలా?

    ముందుగా ఇన్సూరెన్స్ రిపాజిటరీ వద్ద ఖాతా ప్రారంభించాలి. అందుబాటులో ఉన్న ఐదు సంస్థల్లో ఏదో ఒక దాని నుంచి ఖాతా ప్రారంభించవచ్చు. ఇప్పటికే ఫిజికల్ రూపంలో పాలసీ పత్రాలను కలిగి ఉన్నవారు ఎలక్ట్రానిక్ రూపంలో మార్చుకోవాలనుకుంటే... దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు బీమా పత్రాలను జతచేసి బీమా కంపెనీకి సమర్పించాలి. అప్పుడు కంపెనీ పరిశీలన అనంతరం ఈ రూపంలో బీమా పాలసీ జారీ చేస్తుంది. 
    దరఖాస్తు చేసుకున్న అనంతరం ఈ ఇన్సూరెన్స్ ఖాతా ఏడు రోజుల్లోపల ప్రారంభం అవుతుంది. ఖాతా ప్రారంభించిన వెంటనే ఖాతాదారులకు యూజర్ ఐడీ, పాస్ వర్డ్ జారీ చేస్తారు. దాంతో ఎక్కడి నుంచి అయినా ఈ ఇన్సూరెన్స్ ఖాతాలో లాగిన్ అయి వివరాలు పరిశీలించుకోవచ్చు. పాలసీ ప్రీమియంను రిపాజిటరీ ద్వారా కూడా చెల్లించవచ్చు. భవిష్యత్తులో అన్ని పాలసీలు ఎలక్ట్రానిక్ రూపంలో జారీ చేయాలని ఐఆర్డీఏ ఆదేశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకుని రిపాజిటరీ ఖాతా తెరిచి బీమా పత్రాలను ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చుకోవడం బెటర్. 
    పాలసీలు ఉన్నవారే కాదు, భవిష్యత్తులో పాలసీలు తీసుకోవాలనుకునే వారు సైతం ఈ ఇన్సూరెన్స్ ఖాతా తీసుకోవడం మంచి ఆలోచనే. ఒక రిపాజిటరీ దగ్గర ఈ ఇన్సూరెన్స్ ఖాతా కలిగి ఉన్నవారు దాన్ని మరో రిపాజిటరీ సంస్థకు మార్చుకోవాలనుకుంటే అందుకు అవకాశం ఉంది. దేశంలో అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ తమ పాలసీదారులు పత్రాలను ఎలక్ట్రానిక్ రూపంలో మార్చుకునేందుకు వీలుగా ఐదు రిపాజిటరీ సంస్థలతో ఒప్పందం చేసుకుంది.

    Saturday 1 April 2017

    ఫేస్ బుక్ లో వీడియోలు వాటంతటవే ప్లే అయిపోతున్నాయా...?అయితే ఇదిగో పరిష్కారం...!

    మీ ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేయగానే వీడియోలు వాటంతటకవే ప్లే అయిపోతున్నాయా..? ఫేస్‌బుక్ ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ ఫీచర్ ను కొందరు ఇష్టపడుతుంటే మరికొందరు మాత్రం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు.తాజాగా, యూట్యూబ్‌కు పోటీగా ఫేస్‌బుక్ ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన ‘Automatic video-playback' పట్ల పలువురు యూజర్ల నుంచి నెగిటివ్ ఫీడ్‌బ్యాక్ వ్యక్తమవుతోంది. 
    ఈ ఫీచర్, వీడియోలను ఇష్టపడి ప్లే చేసుకునే స్వేచ్ఛకు విరుద్ధంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఫేస్‌బుక్ ఆటోమెటిక్ వీడియో ప్లేబ్యాక్ ఫీచర్‌లో భాగంగా ఫేస్‌బుక్ పేజీలలో వీడియోలు డీఫాల్ట్‌గా ఆటో‌ప్లే అవటం మీరు గమనించే ఉంటారు. 
    వీడియోలు రన్ అవుతున్నంత సేపు మన బ్యాండ్ విడ్త్ ఖర్చవుతూనే ఉంటుంది. వీడియో రంగంలో యూట్యూబ్‌ను అధిగమించేందకు ఫేస్‌బుక్ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.
    ఏమైనప్పటికి ఈ ‘Automatic video-playback' ఫీచర్ మీకు ఇబ్బందని అనిపించినట్లయితే వెంటనే disable చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం...

    1.డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ ద్వారా ఫేస్‌బుక్‌ను వాడుతున్నట్లయితే

    ముందుగా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి. ఆ తరువాత స్ర్కీన్ కడు వైపు పై భాగంలో ఏర్పాటు చేసిన downward arrow sign పై క్లిక్ చేసినట్లయితే డ్రాప్‌డౌన్ మెనూ వస్తుంది. ఆ menuలో ‘సెట్టింగ్స్ ఆప్షన్' పై క్లిక్ చేయండి.ఇప్పుడు కనిపించే General Account Settingsలో ఎడమచేతి వైపు కనిపించే videos ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. వీడియో సెట్టింగ్స్ ఓపెన్ అయిన తరువాత Default మోడ్‌లో ఉన్న ఆటో-ప్లే వీడియోస్ ఆప్షన్‌ను ‘OFF' మోడ్‌లోకి మార్చండి. అంతే, వీడియోలు ఆటోప్లే అవటం మానేస్తాయి.

    2.మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్ ద్వారా ఫేస్‌బుక్‌ను వాడుతున్నట్లయితే

    On, Wi-Fi only, Off ఆప్షన్‌ల ద్వారా వీడియో ఆటో - ప్లే సెట్టింగ్‌లను అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందుగా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి. ఆ తరువాత సెట్టింగ్స్ మెనూలోకి వెళ్లి Video Auto-play ఆప్షన్ ను సెలక్ట్ చేసుకుని సెట్టింగ్ లను మీకు నచ్చినట్టుగా మార్చుకోండి.

    3.ఐఫోన్ లేదా ఐప్యాడ్ ద్వారా ఫేస్‌బుక్‌ను వాడుతున్నట్లయితే 

    ముందుగా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి. ఆ తరువాత సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఫేస్‌బుక్‌‌ను సెలక్ట్ చేసుకోండి. ఫేస్‌బుక్ సెట్టింగ్స్ మెనూలోని ఆటో - ప్లేను సెలక్ట్ చేసుకుని Video Auto-play మోడ్‌ను మీకు నచ్చిన విధంగా మార్చుకోండి.

    Thursday 30 March 2017

    పచ్చిమిరపకాయల అద్భుత ఔషధ గుణాలు...!

    పచ్చిమిరపకాయల గురించి నమ్మలేని నిజాలు!

    సూప్... అల్పాహారం... కర్రీ, చారు, మిక్చర్, బజ్జీ... ప్రతి దానిలోనూ పచ్చిమిరప ఉండాల్సిందే. వంటకమేదైనా స్పైసీ కోరుకునేవారు దీని నామస్మరణ చేయక తప్పదు. ఒక విధంగా ఆహార పదార్థాల్లో ఎందెందు చూసినా అందందే పచ్చిమిరప ఉండును అనేంతగా దీనికి ప్రత్యేకత ఉంది. న్యూట్రిషన్ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం పచ్చిమిరపలో ఎన్నో అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయి.

    తిన్న మూడు గంటలపాటు హుషారే

    పచ్చి మిరపకాయల్లో కేలరీలు సున్నా అన్న విషయం తెలుసా... ఇది నిజం. కానీ, కేలరీలకు మించి మనకు శక్తినిస్తాయి. ఎలా అంటారా... ఇందులో ఉండే రసాయనాలు జీవక్రియలను 50 శాతం వేగవంతం చేస్తాయి. పచ్చిమిరపకాయలను తిన్న మూడు గంటల పాటు ఈ ప్రభావం ఉంటుంది.

    కేన్సర్ నుంచి రక్షణ

    కేన్సర్ నుంచి రక్షణ కల్పిస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ను ఎప్పటికప్పుడు బయటకు పంపించేస్తాయి. దీంతో రక్షణ లభిస్తుంది. ప్రొస్టేట్ గ్రంధి సమస్యలకు పచ్చిమిరపకాయలు మంచి పరిష్కారం.

    గుండె పదిలం

    గుండెకు పచ్చిమిరప రక్షణ కవచం అంటే నమ్ముతారా...? కానీ నమ్మి తీరాల్సిందే. ప్రమాదకర అథెరోస్కెల్ రోసిస్ ను నివారిస్తుంది. రక్తంలో కొలెస్టరాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయులను తగ్గించడం ద్వారా ధమనుల లోపల కొవ్వు ఏర్పడకుండా పచ్చిమిరపలోని రసాయనాలు అడ్డుకుంటాయి. అలాగే రక్తం గడ్డకట్టేందుకు దారితీసే ప్లేట్ లెట్ల సమూహం ఏర్పడకుండా కూడా నివారిస్తుంది. దీనివల్ల హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలు రాకుండా జాగ్రత్తపడవచ్చు.

    మంటలోనే ఉంది ఔషధం

    మిరపకాయలు మంట ఎత్తిస్తాయన్న విషయం తెలుసు కదా. ఈ మంట ఎత్తించే రసాయనమే క్యాప్సేసియన్. ఇది బ్రెయిన్ లోని హైపోదాలమస్ అనే చల్లబరిచే కేంద్రాన్ని ప్రేరేపించడం ద్వారా బాడీ ఉష్ణోగ్రతను పెంచుతుంది.

    సైనస్ ఉన్నవారికి మంచి పరిష్కారం

    జలుబు, సైనస్ ఉన్న వారికి పచ్చిమిరప మంచి సహజ ఔషధం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఉండే క్యాప్సేసియన్ ముక్కు లోపలి మ్యూకస్ మెంబ్రేన్లలను ఉత్తేజపరుస్తుంది. మెంబ్రేన్లకు రక్త సరఫరా మంచిగా జరిగేలా చూస్తుంది. మెంబ్రేన్ అనేది ఒక టిష్యూ. ఇందులో శ్లేష్మం (మ్యూకస్) ఏర్పడడాన్నే సైనస్ గా చెప్పుకోవచ్చు. క్యాప్సేసియన్ వల్ల రక్త సరఫరా మంచిగా జరిగి మెంబ్రేన్లలో శ్లేష్మం పల్చబడుతుంది. దీంతో ఉపశమనం లభిస్తుంది.

    నొప్పి నివారిణి

    మిరపకాయలతో వచ్చే మంట నొప్పి ఉపశమనంగా పనిచేస్తుంది. అంతేకాదు, జీర్ణమవడానికి, మంట ఏర్పడకుండా ఉండేందుకు కూడా ఉపకరిస్తాయి. అయితే, పెప్టిక్ అల్సర్ ఉన్నవారు వీటికి దూరంగా ఉండడమే బెటర్.

    మిరపకాయలను ఎక్కడ సోర్టేజ్ చేయాలి?

    విటమిన్ సీ, బీటా కెరోటిన్ ఉండడం వల్ల పచ్చిమిరపకాయలు కంటి, చర్మ ఆరోగ్యానికి, రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండడానికి తోడ్పడతాయి. పచ్చిమిరపకాయలను చీకటిగా ఉండే, చల్లటి ప్రదేశంలోనే నిల్వ చేయాలి. వెలుగుకు, వేడికి, గాలికి ఎక్స్ పోజ్ కావడం వల్ల పచ్చిమిరపకాయల్లో ఉండే విటమిన్ సీ కోల్పోవడం జరుగుతుంది.

    మూడ్ బాలేదా... మిరపకాయ లాగించాల్సిందే!

    మూడ్ బాలేదా, శరీరం అసౌకర్యంగా, నొప్పులుగా అనిపిస్తోందా...? అయితే, పచ్చిమిరపకాయలు లాగించండి. దీనివల్ల ఎండార్ఫిన్లు విడుదలై మంచి మూడ్ రావడానికి, నొప్పి ఉపశమనంగానూ పనిచేస్తాయి.

    మధుమేహులకూ...

    రక్తంలో షుగర్ స్థాయులను కూడా కంట్రోల్ చేస్తుంది. అందుకే మధుమేహులు ప్రతిరోజు తమ ఆహారంలో వీటిని తప్పకుండా తీసుకోవాలి.

    ఐరన్ తగినంత

    వీటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అందుకే ఐరన్ లోపం ఉన్న వారికి మిరప మంచి ఔషధం.

    చర్మానికి రక్షణ

    వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు బాగానే ఉన్నాయి. అందుకే చర్మ వ్యాధుల నివారణలో ఉపయోగపడతాయి.

    విటమిన్ కే

    పచ్చిమిర్చిలో విటమిన్ కె కూడ తగినంత ఉంటుంది. ఇది అస్టియోపోరోసిస్ రిస్క్ ను తగ్గించడమే కాకుండా బ్లీడింగ్ సమస్య లేకుండా చేస్తుంది.

    Monday 27 March 2017

    ఆధార్ కార్డ్ లోని సమాచారాన్ని స్వయంగా ఆన్ లైన్ లో సరిచేసుకోవడం ఎలా...?


    ఆధార్ కార్డు తీసుకున్నాం.. పేరులో తప్పు దొర్లింది... లేదా చిరునామా మారింది. పుట్టిన తేదీ, ఫోన్ నెంబర్ లేదా ఇతరత్రా సమాచారంలో ఏదేనీ మార్పులు చోటు చేసుకుంటే వాటిని సరిచేసుకోవడం చాలా సులభం. నెట్ సదుపాయం ఉంటే ఆధార్ కార్డులను జారీ చేసే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ కు వెళ్లి స్వయంగా మనమే సరిచేసుకోవచ్చు. అదెలానో చూద్దాం... 


    ముందుగా ... 
    https://ssup.uidai.gov.in/web/guest/update వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద నల్లటి అక్షరాల్లో కనిపిస్తున్న వెరిఫికేషన్ కోడ్ ను టైప్ చేయాలి. సెండ్ ఓటీపీ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేస్తే తర్వాతి పేజీకి వెళతాం. 
    ఇక్కడ పేరు లేదా చిరునామా, మొబైల్ నంబర్, ఈ మెయిల్... వీటిలో మార్చాల్సిన వాటిని సెలక్ట్ చేసుకుని వివరాలు ఇంగ్లిష్ లేదా ప్రాంతీయ భాషలో నమోదు చేయాలి. మార్చిన వివరాలకు ఆధారంగా ఏదేనీ డాక్యుమెంట్ కాపీ సమర్పించాల్సి ఉంటుంది. చిరునామాలో మార్పు అయితే కొత్త చిరునామాను తెలియజేసే డాక్యుమెంట్ జిరాక్స్ కాపీపై సెల్ఫ్ అటెస్టేషన్ తో స్కాన్ చేసి దాన్ని అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. చివరిగా యూటీఆర్ నంబర్ రాసి పెట్టుకుంటే తర్వాత విచారణకు ఉపకరిస్తుంది. 
    కొత్త వివరాలు ఆధార్ లో చోటు చేసుకున్నాయా.. లేదా అనే దానిని పరిశీలించేందుకు https://ssup.uidai.gov.in/web/guest/check-status సైట్ కు వెళ్లాలి. ఆధార్ నంబర్, యూఆర్ఎన్ నంబర్లను నమోదు చేసి గెట్ స్టేటస్ బటన్ క్లిక్ చేసే స్టేటస్ వస్తుంది. వెయిటింగ్ అప్రూవల్ లేక అప్రూవల్ అయిందా అన్నది తెలుస్తుంది. అప్రూవల్ ముగిస్తే నూతన ఆధార్ కార్డును ఈ కార్డు రూపంలో పొందవచ్చు. 
    ఇందుకు https://eaadhaar.uidai.gov.in/ సైట్ ఓపెన్ చేయాలి ఎన్ రోల్ మెంట్ నంబర్, లేదా ఆధార్ నంబర్ ఏది ఉంటే దాన్ని పైన సెలక్ట్ చేసుకుని ఆ నంబర్ ను కిందనున్న కాలమ్ లో ఎంటర్ చేయాలి. పూర్తి పేరు. పిన్ కోడ్, తర్వాత కాలమ్ కింద కనిపించే అక్షరాలు, మొబైల్ నంబర్ నమోదు చేయాలి. గెట్ వన్ టైమ్ పాస్ వర్డ్ క్లిక్ చేస్తే మొబైల్ కు పాస్ వర్డ్ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి క్లిక్ చేయగానే పీడీఎఫ్ రూపంలో ఆధార్ డౌన్ లోడ్ అవుతుంది.

    రిజిస్టర్ మొబైల్ నంబర్ మనుగడలో లేకుంటే

    ఆధార్ కార్డు తీసుకునే సమయానికి ఇచ్చిన మొబైల్ నంబర్ ప్రస్తుతం వాడుకలో లేకుంటే ఆన్ లైన్ లో ఆధార్ వివరాలు అప్ డేట్ చేసుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే, అప్ డేట్ చేసుకునే ముందు రిజిస్టర్ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. దాని ద్వారానే ముందుకు వెళ్లడం సాధ్యం అవుతుంది. కనుక కార్డు తీసుకునే సమయంలో ఇచ్చిన నంబర్ మీ దగ్గరే ఉండి, కొత్త మొబైల్ నంబర్ ను అప్ డేట్ చేసుకోవాలంటే మాత్రం సాధ్యమవుతుంది. అటువంటి వారు సైట్ లో లాగిన్ అయిన తర్వాత ఆధార్ వివరాల అప్ డేట్ కాలమ్ లోనే మొబైల్ నంబర్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఒకవేళ కార్డు తీసుకునే సమయంలో ఇచ్చిన నంబర్ మారిపోయి ఉంటే దగ్గర్లోని ఆధార్ కేంద్రానికి వెళ్లి మొబైల్ నంబర్ ను మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలి. లేదా పోస్ట్ ద్వారానూ దరఖాస్తు పంపవచ్చు.

    చిరునామాలు

    Address 1: UIDAI, Post Box No. 10, Chhindwara, Madhya Pradesh – 480001, India. 
    Address 2: UIDAI, Post Box No.99, Banjara Hills, Hyderabad – 500034, India. 
    కవర్ పైన స్పష్టంగా ఆధార్ అప్ డేట్ / కరెక్షన్ అని రాయాలి. అలాగే, పంపేవారి చిరునామానూ తప్పనిసరిగా పేర్కొనాలి. గుర్తింపు పత్రాన్ని కూడా జతచేయాలి.