Saturday 1 April 2017

ఫేస్ బుక్ లో వీడియోలు వాటంతటవే ప్లే అయిపోతున్నాయా...?అయితే ఇదిగో పరిష్కారం...!

మీ ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేయగానే వీడియోలు వాటంతటకవే ప్లే అయిపోతున్నాయా..? ఫేస్‌బుక్ ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ ఫీచర్ ను కొందరు ఇష్టపడుతుంటే మరికొందరు మాత్రం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు.తాజాగా, యూట్యూబ్‌కు పోటీగా ఫేస్‌బుక్ ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన ‘Automatic video-playback' పట్ల పలువురు యూజర్ల నుంచి నెగిటివ్ ఫీడ్‌బ్యాక్ వ్యక్తమవుతోంది. 
ఈ ఫీచర్, వీడియోలను ఇష్టపడి ప్లే చేసుకునే స్వేచ్ఛకు విరుద్ధంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఫేస్‌బుక్ ఆటోమెటిక్ వీడియో ప్లేబ్యాక్ ఫీచర్‌లో భాగంగా ఫేస్‌బుక్ పేజీలలో వీడియోలు డీఫాల్ట్‌గా ఆటో‌ప్లే అవటం మీరు గమనించే ఉంటారు. 
వీడియోలు రన్ అవుతున్నంత సేపు మన బ్యాండ్ విడ్త్ ఖర్చవుతూనే ఉంటుంది. వీడియో రంగంలో యూట్యూబ్‌ను అధిగమించేందకు ఫేస్‌బుక్ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.
ఏమైనప్పటికి ఈ ‘Automatic video-playback' ఫీచర్ మీకు ఇబ్బందని అనిపించినట్లయితే వెంటనే disable చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం...

1.డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ ద్వారా ఫేస్‌బుక్‌ను వాడుతున్నట్లయితే

ముందుగా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి. ఆ తరువాత స్ర్కీన్ కడు వైపు పై భాగంలో ఏర్పాటు చేసిన downward arrow sign పై క్లిక్ చేసినట్లయితే డ్రాప్‌డౌన్ మెనూ వస్తుంది. ఆ menuలో ‘సెట్టింగ్స్ ఆప్షన్' పై క్లిక్ చేయండి.ఇప్పుడు కనిపించే General Account Settingsలో ఎడమచేతి వైపు కనిపించే videos ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. వీడియో సెట్టింగ్స్ ఓపెన్ అయిన తరువాత Default మోడ్‌లో ఉన్న ఆటో-ప్లే వీడియోస్ ఆప్షన్‌ను ‘OFF' మోడ్‌లోకి మార్చండి. అంతే, వీడియోలు ఆటోప్లే అవటం మానేస్తాయి.

2.మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్ ద్వారా ఫేస్‌బుక్‌ను వాడుతున్నట్లయితే

On, Wi-Fi only, Off ఆప్షన్‌ల ద్వారా వీడియో ఆటో - ప్లే సెట్టింగ్‌లను అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందుగా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి. ఆ తరువాత సెట్టింగ్స్ మెనూలోకి వెళ్లి Video Auto-play ఆప్షన్ ను సెలక్ట్ చేసుకుని సెట్టింగ్ లను మీకు నచ్చినట్టుగా మార్చుకోండి.

3.ఐఫోన్ లేదా ఐప్యాడ్ ద్వారా ఫేస్‌బుక్‌ను వాడుతున్నట్లయితే 

ముందుగా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి. ఆ తరువాత సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఫేస్‌బుక్‌‌ను సెలక్ట్ చేసుకోండి. ఫేస్‌బుక్ సెట్టింగ్స్ మెనూలోని ఆటో - ప్లేను సెలక్ట్ చేసుకుని Video Auto-play మోడ్‌ను మీకు నచ్చిన విధంగా మార్చుకోండి.

No comments:

Post a Comment