Thursday 30 March 2017

పచ్చిమిరపకాయల అద్భుత ఔషధ గుణాలు...!

పచ్చిమిరపకాయల గురించి నమ్మలేని నిజాలు!

సూప్... అల్పాహారం... కర్రీ, చారు, మిక్చర్, బజ్జీ... ప్రతి దానిలోనూ పచ్చిమిరప ఉండాల్సిందే. వంటకమేదైనా స్పైసీ కోరుకునేవారు దీని నామస్మరణ చేయక తప్పదు. ఒక విధంగా ఆహార పదార్థాల్లో ఎందెందు చూసినా అందందే పచ్చిమిరప ఉండును అనేంతగా దీనికి ప్రత్యేకత ఉంది. న్యూట్రిషన్ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం పచ్చిమిరపలో ఎన్నో అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయి.

తిన్న మూడు గంటలపాటు హుషారే

పచ్చి మిరపకాయల్లో కేలరీలు సున్నా అన్న విషయం తెలుసా... ఇది నిజం. కానీ, కేలరీలకు మించి మనకు శక్తినిస్తాయి. ఎలా అంటారా... ఇందులో ఉండే రసాయనాలు జీవక్రియలను 50 శాతం వేగవంతం చేస్తాయి. పచ్చిమిరపకాయలను తిన్న మూడు గంటల పాటు ఈ ప్రభావం ఉంటుంది.

కేన్సర్ నుంచి రక్షణ

కేన్సర్ నుంచి రక్షణ కల్పిస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ను ఎప్పటికప్పుడు బయటకు పంపించేస్తాయి. దీంతో రక్షణ లభిస్తుంది. ప్రొస్టేట్ గ్రంధి సమస్యలకు పచ్చిమిరపకాయలు మంచి పరిష్కారం.

గుండె పదిలం

గుండెకు పచ్చిమిరప రక్షణ కవచం అంటే నమ్ముతారా...? కానీ నమ్మి తీరాల్సిందే. ప్రమాదకర అథెరోస్కెల్ రోసిస్ ను నివారిస్తుంది. రక్తంలో కొలెస్టరాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయులను తగ్గించడం ద్వారా ధమనుల లోపల కొవ్వు ఏర్పడకుండా పచ్చిమిరపలోని రసాయనాలు అడ్డుకుంటాయి. అలాగే రక్తం గడ్డకట్టేందుకు దారితీసే ప్లేట్ లెట్ల సమూహం ఏర్పడకుండా కూడా నివారిస్తుంది. దీనివల్ల హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలు రాకుండా జాగ్రత్తపడవచ్చు.

మంటలోనే ఉంది ఔషధం

మిరపకాయలు మంట ఎత్తిస్తాయన్న విషయం తెలుసు కదా. ఈ మంట ఎత్తించే రసాయనమే క్యాప్సేసియన్. ఇది బ్రెయిన్ లోని హైపోదాలమస్ అనే చల్లబరిచే కేంద్రాన్ని ప్రేరేపించడం ద్వారా బాడీ ఉష్ణోగ్రతను పెంచుతుంది.

సైనస్ ఉన్నవారికి మంచి పరిష్కారం

జలుబు, సైనస్ ఉన్న వారికి పచ్చిమిరప మంచి సహజ ఔషధం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఉండే క్యాప్సేసియన్ ముక్కు లోపలి మ్యూకస్ మెంబ్రేన్లలను ఉత్తేజపరుస్తుంది. మెంబ్రేన్లకు రక్త సరఫరా మంచిగా జరిగేలా చూస్తుంది. మెంబ్రేన్ అనేది ఒక టిష్యూ. ఇందులో శ్లేష్మం (మ్యూకస్) ఏర్పడడాన్నే సైనస్ గా చెప్పుకోవచ్చు. క్యాప్సేసియన్ వల్ల రక్త సరఫరా మంచిగా జరిగి మెంబ్రేన్లలో శ్లేష్మం పల్చబడుతుంది. దీంతో ఉపశమనం లభిస్తుంది.

నొప్పి నివారిణి

మిరపకాయలతో వచ్చే మంట నొప్పి ఉపశమనంగా పనిచేస్తుంది. అంతేకాదు, జీర్ణమవడానికి, మంట ఏర్పడకుండా ఉండేందుకు కూడా ఉపకరిస్తాయి. అయితే, పెప్టిక్ అల్సర్ ఉన్నవారు వీటికి దూరంగా ఉండడమే బెటర్.

మిరపకాయలను ఎక్కడ సోర్టేజ్ చేయాలి?

విటమిన్ సీ, బీటా కెరోటిన్ ఉండడం వల్ల పచ్చిమిరపకాయలు కంటి, చర్మ ఆరోగ్యానికి, రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండడానికి తోడ్పడతాయి. పచ్చిమిరపకాయలను చీకటిగా ఉండే, చల్లటి ప్రదేశంలోనే నిల్వ చేయాలి. వెలుగుకు, వేడికి, గాలికి ఎక్స్ పోజ్ కావడం వల్ల పచ్చిమిరపకాయల్లో ఉండే విటమిన్ సీ కోల్పోవడం జరుగుతుంది.

మూడ్ బాలేదా... మిరపకాయ లాగించాల్సిందే!

మూడ్ బాలేదా, శరీరం అసౌకర్యంగా, నొప్పులుగా అనిపిస్తోందా...? అయితే, పచ్చిమిరపకాయలు లాగించండి. దీనివల్ల ఎండార్ఫిన్లు విడుదలై మంచి మూడ్ రావడానికి, నొప్పి ఉపశమనంగానూ పనిచేస్తాయి.

మధుమేహులకూ...

రక్తంలో షుగర్ స్థాయులను కూడా కంట్రోల్ చేస్తుంది. అందుకే మధుమేహులు ప్రతిరోజు తమ ఆహారంలో వీటిని తప్పకుండా తీసుకోవాలి.

ఐరన్ తగినంత

వీటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అందుకే ఐరన్ లోపం ఉన్న వారికి మిరప మంచి ఔషధం.

చర్మానికి రక్షణ

వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు బాగానే ఉన్నాయి. అందుకే చర్మ వ్యాధుల నివారణలో ఉపయోగపడతాయి.

విటమిన్ కే

పచ్చిమిర్చిలో విటమిన్ కె కూడ తగినంత ఉంటుంది. ఇది అస్టియోపోరోసిస్ రిస్క్ ను తగ్గించడమే కాకుండా బ్లీడింగ్ సమస్య లేకుండా చేస్తుంది.

Monday 27 March 2017

ఆధార్ కార్డ్ లోని సమాచారాన్ని స్వయంగా ఆన్ లైన్ లో సరిచేసుకోవడం ఎలా...?


ఆధార్ కార్డు తీసుకున్నాం.. పేరులో తప్పు దొర్లింది... లేదా చిరునామా మారింది. పుట్టిన తేదీ, ఫోన్ నెంబర్ లేదా ఇతరత్రా సమాచారంలో ఏదేనీ మార్పులు చోటు చేసుకుంటే వాటిని సరిచేసుకోవడం చాలా సులభం. నెట్ సదుపాయం ఉంటే ఆధార్ కార్డులను జారీ చేసే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ కు వెళ్లి స్వయంగా మనమే సరిచేసుకోవచ్చు. అదెలానో చూద్దాం... 


ముందుగా ... 
https://ssup.uidai.gov.in/web/guest/update వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద నల్లటి అక్షరాల్లో కనిపిస్తున్న వెరిఫికేషన్ కోడ్ ను టైప్ చేయాలి. సెండ్ ఓటీపీ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేస్తే తర్వాతి పేజీకి వెళతాం. 
ఇక్కడ పేరు లేదా చిరునామా, మొబైల్ నంబర్, ఈ మెయిల్... వీటిలో మార్చాల్సిన వాటిని సెలక్ట్ చేసుకుని వివరాలు ఇంగ్లిష్ లేదా ప్రాంతీయ భాషలో నమోదు చేయాలి. మార్చిన వివరాలకు ఆధారంగా ఏదేనీ డాక్యుమెంట్ కాపీ సమర్పించాల్సి ఉంటుంది. చిరునామాలో మార్పు అయితే కొత్త చిరునామాను తెలియజేసే డాక్యుమెంట్ జిరాక్స్ కాపీపై సెల్ఫ్ అటెస్టేషన్ తో స్కాన్ చేసి దాన్ని అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. చివరిగా యూటీఆర్ నంబర్ రాసి పెట్టుకుంటే తర్వాత విచారణకు ఉపకరిస్తుంది. 
కొత్త వివరాలు ఆధార్ లో చోటు చేసుకున్నాయా.. లేదా అనే దానిని పరిశీలించేందుకు https://ssup.uidai.gov.in/web/guest/check-status సైట్ కు వెళ్లాలి. ఆధార్ నంబర్, యూఆర్ఎన్ నంబర్లను నమోదు చేసి గెట్ స్టేటస్ బటన్ క్లిక్ చేసే స్టేటస్ వస్తుంది. వెయిటింగ్ అప్రూవల్ లేక అప్రూవల్ అయిందా అన్నది తెలుస్తుంది. అప్రూవల్ ముగిస్తే నూతన ఆధార్ కార్డును ఈ కార్డు రూపంలో పొందవచ్చు. 
ఇందుకు https://eaadhaar.uidai.gov.in/ సైట్ ఓపెన్ చేయాలి ఎన్ రోల్ మెంట్ నంబర్, లేదా ఆధార్ నంబర్ ఏది ఉంటే దాన్ని పైన సెలక్ట్ చేసుకుని ఆ నంబర్ ను కిందనున్న కాలమ్ లో ఎంటర్ చేయాలి. పూర్తి పేరు. పిన్ కోడ్, తర్వాత కాలమ్ కింద కనిపించే అక్షరాలు, మొబైల్ నంబర్ నమోదు చేయాలి. గెట్ వన్ టైమ్ పాస్ వర్డ్ క్లిక్ చేస్తే మొబైల్ కు పాస్ వర్డ్ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి క్లిక్ చేయగానే పీడీఎఫ్ రూపంలో ఆధార్ డౌన్ లోడ్ అవుతుంది.

రిజిస్టర్ మొబైల్ నంబర్ మనుగడలో లేకుంటే

ఆధార్ కార్డు తీసుకునే సమయానికి ఇచ్చిన మొబైల్ నంబర్ ప్రస్తుతం వాడుకలో లేకుంటే ఆన్ లైన్ లో ఆధార్ వివరాలు అప్ డేట్ చేసుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే, అప్ డేట్ చేసుకునే ముందు రిజిస్టర్ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. దాని ద్వారానే ముందుకు వెళ్లడం సాధ్యం అవుతుంది. కనుక కార్డు తీసుకునే సమయంలో ఇచ్చిన నంబర్ మీ దగ్గరే ఉండి, కొత్త మొబైల్ నంబర్ ను అప్ డేట్ చేసుకోవాలంటే మాత్రం సాధ్యమవుతుంది. అటువంటి వారు సైట్ లో లాగిన్ అయిన తర్వాత ఆధార్ వివరాల అప్ డేట్ కాలమ్ లోనే మొబైల్ నంబర్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఒకవేళ కార్డు తీసుకునే సమయంలో ఇచ్చిన నంబర్ మారిపోయి ఉంటే దగ్గర్లోని ఆధార్ కేంద్రానికి వెళ్లి మొబైల్ నంబర్ ను మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలి. లేదా పోస్ట్ ద్వారానూ దరఖాస్తు పంపవచ్చు.

చిరునామాలు

Address 1: UIDAI, Post Box No. 10, Chhindwara, Madhya Pradesh – 480001, India. 
Address 2: UIDAI, Post Box No.99, Banjara Hills, Hyderabad – 500034, India. 
కవర్ పైన స్పష్టంగా ఆధార్ అప్ డేట్ / కరెక్షన్ అని రాయాలి. అలాగే, పంపేవారి చిరునామానూ తప్పనిసరిగా పేర్కొనాలి. గుర్తింపు పత్రాన్ని కూడా జతచేయాలి.

మీ పెన్‌డ్రైవ్‌కు పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకోవటం ఎలా...

పెన్‌డ్రైవ్‌లను ముఖ్యంగా డేటా ట్రాన్స్‌ఫర్‌కు ఉపయోగిస్తాం. ఏ విధమైన ప్రొటెక్షన్ లేకపోయినట్లయితే మన పెన్‌డ్రైవ్‌లో స్టోర్ అయి ఉన్న సమాచారాన్ని ఇతరులు సులువుగా యాక్సెస్ చేసుకునే వీలుంటుంది. పాస్‌వర్డ్ ప్రొటెక్షన్‌ను ఏర్పాటు చేసుకోవటం ద్వారా పెన్‌డ్రైవ్‌లోని డేటాను ఎవ్వరు యాక్సెస్ చేసుకోలేరు. పెన్‌డ్రైవ్‌కు పాస్‌వర్డ్ ప్రొటెక్షన్‌ను ఏర్పాటు చేసుకోగలిగే తీరైన మార్గాలను ఇక్కడ సూచించటం జరుగుతోంది.
పెన్‌డ్రైవ్‌లను ప్రొటెక్ట్ చేసేందకు విండోస్ అధికారికంగా అందిస్తోన్న మాన్యువల్ పద్ధతే BitLock Encryption. ఈ ప్రొటెక్షన్‌ను ఎంపిక చేసుకోవటం ద్వారా పెన్‌డ్రైవ్‌ను యూఎస్బీకి కనెక్ట్ చేసే ప్రతిసారి బిట్‌లాక్ కోడ్‌ను ఎంటర్ చేసి డ్రైవ్‌లోని డేటాను యాక్సెస్ చేసుకోవల్సి ఉంటుంది. పెన్‌డ్రైవ్‌కు బిట్‌లాక్ ఎన్‌క్రిప్షన్‌ను ఏర్పాటు చేసే ప్రక్రియను ఇప్పుడు చూద్దాం..

STEP 1: మీ పెన్‌డ్రైవ్‌‌ను ముందుగా కంప్యూటర్‌కు కనెక్ట్ చేయండి. 

STEP 2 : పెన్‌డ్రైవ్‌ కనెక్ట్ అయిన వెంటనే మైకంప్యూటర్స్‌లోకి వెళ్లి యూఎస్బీ డ్రైవ్ పై మౌస్‌తో రైట్ క్లిక్ ఇవ్వండి.

STEP 3 : ఇప్పుడు కనిపించే ఆప్షన్స్ మెనూలో Turn on BitLockrను సెలక్ట్ చేసుకోండి. 

STEP 4 : ఇప్పుడు BitLock Encryption డ్రైవ్‌కు సంబంధించిన ప్రత్యేకమైన మెనూ ఓపెన్ అవుతుంది. ఆ మెనూ బాక్సులో "use a password to unlock the drive" ఆప్షన్‌ను టిక్ చేయండి.  
STEP 5 : ఆ మెనూలో కనిపించే ఖాళీల్లో మీకు నచ్చిన పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి next బటన్ పై క్లిక్ చేయండి. 

STEP 6 : తరువాత కనిపించే మెనూలో save the recovery key to file అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవటం ద్వారా మీ పాస్‍వర్డ్‌ను కంప్యూటర్‌లో ఎక్కడైనా సేవ్ చేసుకొని మరచి పోయినపుడు పొందవచ్చు.

STEP 7 : next బటన్ పై క్లిక్ చేయటం ద్వారా మీ పెన్‌డ్రైవ్‌లోని పైల్స్ అన్నీ encrypt చేయబడుతాయి. 

STEP 8 : ఎన్‌క్రిప్సన్ పూర్తయ్యాక close బటన్ పై క్లిక్ చేయండి. పెన్‍డ్రైవ్‌ను తీసి మరలా పీసీకి కనెక్ట్ చెయ్యండి. ఇక పై మీరు, మీ పెన్‌డ్రైవ్‌ను ఎప్పుడు ఏ పీసీకి కనెక్టు చేసినా Password ఎంటర్ చేస్తేనే డ్రైవ్ ఓపెన్ అవుతుంది.

Sunday 26 March 2017

VLC మీడియా ప్లేయర్ కీ బోర్డు షార్ట్ కట్స్ తెలుసుకోండి...


Saturday 25 March 2017

ఆధార్‌కి పాన్ కార్డు లింక్ చేయడం ఎలా..?


 కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది.ఆధార్ కార్డుకి పాన్ కార్డుకి లింక్ చేయాలని చెబుతోంది. అలా లింక్ చేయకపోతే వచ్చే సంవత్సరం జనవరి ఒకటో తేదీ తర్వాత మీ పాన్ కార్డు ఎందుకూ పనికిరాదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డుకి పాన్ కార్డుకి లింక్ చేయాలని చెబుతోంది. అలా లింక్ చేయకపోతే వచ్చే సంవత్సరం జనవరి ఒకటో తేదీ తర్వాత మీ పాన్ కార్డు ఎందుకూ పనికిరాదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో చాలామందికి ఎలా లింక్ చేయాలో తెలియదు..ఆధార్‌కి పాన్ కార్డు లింక్ చేయడం ఎలాగో ఓ సారి చూద్దాం. త్వరగా ఆధార్‌కి పాన్ కార్డు లింక్ చేయండి, లేకుంటే పాన్ కార్డు చెల్లదు

1.https://incometaxindiaefiling.gov.in లో మీరు ముందుగా  లాగిన్ కావాల్సి ఉంటుంది. మీ వివరాలతో అందులో రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంటుంది.

2.మీరు లాగిన్ కాగానే మీకు అక్కడ పాప్ అప్ విండో ఒకటి కనిపిస్తుంది. ఆధార్ లింక్ చేయమని అడుగుతుంది.అక్కడ మీరు ఆధార్ నంబర్ తో పాటు పాన్ కార్డుకు సంబంధించిన వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుందిమీరు ఇచ్చిన వివరాలు కరెక్ట్ గా ఉంటే అక్కడ Link Now అనే ఆప్సన్ మీకు కనిపిస్తుంది.

3.దాన్ని మీరు క్లిక్ చేయగానే మీ మొబైల్ నంబర్ అడుగుతుంది. అది ఎంటర్ చేయగానే మీకు ఓటీపీ కోడ్ వస్తుంది. దాంతో పాటు మీ మెయిల్ కి ఓ లింక్ కూడా వస్తుంది. దాన్ని క్లిక్ చేసి మీరు ఓటీపీ యాడ్ చేయాల్సి ఉంటుంది.

ఆ ప్రాసెస్ అయిపోగానే మీకు ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ అయిందంటూ మెసేజ్ కనిపిస్తుంది. మీ పని అయిపోయినట్లే.

Friday 24 March 2017

సులువుగా బరువుని తగ్గించుకోవడానికి చిట్కాలు....


బరువు తగ్గాలంటే అందుకు ఇదీ అంటూ ప్రత్యేకంగా ఓ నియమం ఏమీ లేదు. బరువు తగ్గేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఎవరికి అనువైనది వారు ఫాలో అయిపోతే చాలు. బరువు తగ్గాలనుకుంటూ ఏమీ చేయలేకపోతున్న వారు పోషకాహార నిపుణులు చెబుతున్న ఈ చిట్కాల గురించి తెలుసుకోండి.

కార్బో హైడ్రేట్లను తగ్గించండి

కార్బోహైడ్రేట్లు, ఫాట్స్ బరువు పెరడానికి దోహదం చేస్తాయి. అందుకని వీటి మోతాదును తగ్గించి ప్రొటీన్ తో కూడిన ఆహారాన్ని పెంచాలి. పాలల్లో ప్రొటీన్ పొడి వేసుకుని తాగినా సరే. ప్రొటీన్ షేక్స్ అయినా ఓకే. వీటివల్ల కడుపు నిండినట్టు ఉంటుంది.

కేలరీలను కరిగించాలి

రోజువారీ శారీరక వ్యాయామాన్ని మించింది లేదు. ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది కదలకుండా కూర్చుని పనిచేయడం ఎక్కువైపోయింది. ఇలా అయితే ఆరోగ్యానికి మహా ముప్పే. శారీరక వ్యాయామం చేయమన్నారుగా అని వ్యాయామశాల కోసం వెతకాల్సిన పనేమీ లేదు. రోజూ నిర్ణీత సమయం పాటు వేగంగా నడిచినా సరిపోతుంది.

మెటబాలిజం రేటును పెంచుకోవాలి

మెటబాలిజం వేగం పుంజుకుంటే మరిన్ని కేలరీలు ఖర్చయిపోతాయి. రోజువారీ వ్యాయామంతోపాటు మెటబాలిజం రేటును పెంచే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలి. గ్రీన్ టీ, గ్రీన్ కాఫీ, గార్సినియా, అకాయ్ బెర్రీ ల్లాంటివి. 
మధ్య మధ్యలో బరువును చూసుకుంటూ ఉండాలి. చిట్కాలు పాటించక ముందు, పాటించిన తర్వాత వచ్చిన మార్పులను గమనించాలి. ఫలితాలను బట్టి ఇంకా ఏమైనా మార్పులు చేసుకోవాలా? అనే విషయం స్పష్టమవుతుంది.



Thursday 23 March 2017

HOW TO GET RID OF VIRUS FROM YOUR COMPUTER...

Computer viruses are more like their biological counterparts,leaves the same to Computer once if it gets affected. If you think your computer has been infected bu viruses, the only safe course of action is to use a good anti-virus program.


Step1:As soon as you suspect that your computer has a virus, remove your computer from any networks it might be on, as well as from the Internet, so that you don't inadvertently spread the bug to others. Unplug your network cable if you have to.
Step2:If you have virus-scanning (anti-virus) software installed, run it.
Step3:If you don't have anti-virus software, you'll need to obtain some. If you can't get it from a network administrator or download it from an uninfected computer, you can mail-order it from a retailer.
Step4:Start your computer (still not connected to a network) and follow the instructions that came with the anti-virus software.
Step5:Keep running the virus-scanning software until your computer comes up clean.
Step6:Reconnect your computer to the Internet and check with the anti-virus software's publisher to make sure you have the latest updates. If not, download them now.
Step7:After updating the anti-virus software, run it again until your computer comes up clean.

Warning:There's no substitute for prevention. Good anti-virus software more than pays for itself as long as you keep it up-to-date.Common sense also goes a long way toward keeping your computer clean.
Never open an attachment from someone you don't know, and be suspicious of odd attachments from people you do know (a virus may have mailed itself to you from their computer).

మధుమేహం వున్నవారు పాటించాల్సిన వ్యాయామ సూత్రాలు...!


వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. 
* వ్యాయామం వల్ల కండరాలు పటిష్ఠంగా ఉంటాయి. కణాలు ఇన్సులిన్ ను గ్రహించే శక్తి మెరుగవుతుంది. సంతోషాన్నిచ్చే ఎండార్ఫిన్లు, సెరటోనిన్ వంటి రసాయనాల ఉత్పత్తి పెరుగుతుంది. 
* లో బ్లడ్ షుగర్ అనేది హై బ్లడ్ షుగర్ (హైపో గ్లైసేమియా) కంటే అత్యంత ప్రమాదకరమని వైద్యులు చెబుతుంటారు. అందుకని వ్యాయమానికి బయల్దేరే ముందు మధుమేహులు కాస్తంత స్నాక్స్ తీసుకోవాలి. లేదా క్యాండీస్, గ్లూకోజ్ బిస్కట్లు, జ్యూస్ వంటివి వెంట తీసుకెళితే షుగర్ తక్కువైపోయి అత్యవసర పరిస్థితి ఏర్పడితే తీసుకునేందుకు అనువుగా ఉంటాయి. 
* షుగర్ వ్యాధి ఉన్న వారు పాదాలను అపురూపంగా చూసుకోవాలి. కనుక సౌకర్యంగా ఉన్న పాదరక్షలను ధరించాలి. వ్యాయామానికి ముందు, తర్వాత బ్లడ్ గ్లూకోజ్ చెక్ చేసుకోవాలి. దీనివల్ల వ్యాయామం ఎంత మేరకు చేయాలన్న విషయమై చక్కటి అవగాహన ఉంటుంది. 
* డయాబెటిక్ న్యూరోపతి సమస్య ఉన్నవారు దూకడం (జంపింగ్) వంటి పనులకు దూరంగా ఉండాలి. పాదాలకు గాయాలు కాకుండా చూసుకోవాలి. సింపుల్ ఎక్సర్ సైజ్ లు వీరికి మంచిది. 
* రోజుకు కనీసం పదివేల అడుగులు వేసేలా ప్లాన్ చేసుకోండి. వ్యాయామానికి వెళ్లేటప్పుడు మీ వివరాలను తెలిపేలా, అత్యవసర సందర్భాల్లో సంప్రదించాల్సిన వారి నంబర్ తో ఓ ఐడీ దగ్గర ఉంచుకోవడం నయం.

Tuesday 21 March 2017

మదుమేహం వున్నవాళ్లు కూడా మామిడిపండు తినవచ్చునట...!

మామిడి పండ్ల సీజన్ వచ్చేస్తోంది. మామిడి పండును చూసినా... ఆ పండు వెదజల్లే పరిమళం ముక్కుపుటాలను చేరినా తినకుండా ఉండడం కష్టతరం. అయితే, ఇంతటి మధురమైన పండును తినే విషయంలో షుగర్ వ్యాధి ఉన్నవారికి ఎన్నో సందేహాలు వస్తుంటాయి. తింటే బ్లడ్ షుగర్ పెరిగిపోతుందేమోనన్న భయం వారిని వేధిస్తుంటుంది. మరి మామిడి పండును నిర్భయంగా తినవచ్చా...? 
నిశ్చింతగా తినవచ్చు అంటున్నారు ప్రముఖ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ పంకజ్ అగర్వాల్. కాకపోతే, ఎక్కువ కాకుండా చూసుకోవాలి అంతే. మామిడి పండ్లలో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి6, పొటాషియం, ఫోలిక్ యాసిడ్ ఉన్నాయి. ఒక మ్యాంగోలో ఉన్న కేలరీలు ఒకటిన్నర రోటీలో ఉండే కేలరీలతో సమానం. ఒక మామిడి పండు తిన్నంత మాత్రాన రక్తంలో గ్లూకోజ్ పెద్దగా పెరిగిపోదు. 
కాకపోతే అన్నం తిన్న వెంటనే లేదా, అన్నంతోపాటు మామిడి పండు తినకూడదు. స్నాక్స్ టైమ్ లో స్నాక్స్ కు బదులు మామిడి పండు సగం మేర తీసుకోవచ్చు. దానివల్ల తగినంత శక్తి లభిస్తుంది. పైగా తీసుకుంటున్నది కొద్ది పరిమాణంలోనే కాబట్టి రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ కూడా పెరగవు. కనుక రోజులో నాలుగు గంటల విరామంతో మూడు పర్యాయాలు మామిడి పండును, ప్రతిసారి సగానికి మించకుండా తీసుకోవచ్చు. వేయించిన శనగలు లేదా పెసరపప్పుతో పాటు మామిడి పండును తీసుకున్నట్లయితే ప్రొటీన్స్, ఫైబర్ తగినంత లభించి రక్తంలో గ్లూకోజ్ పెరిగిపోకుండా నియంత్రణలో ఉంటుంది.

Monday 20 March 2017

Here is How to use UPI mobile wallet ...!

పార్టీ ఇస్తానని చెప్పి ఫ్రెండ్స్, కొలీగ్స్ ను రెస్టారెంట్ కు తీసుకెళ్లారు. అతిథి దేవోభవ అన్న రీతిలో కోరిందల్లా ఆర్డర్ ఇచ్చుకుని కుమ్మేయండని ప్రోత్సహించారు. ఓహోహో.. నాకే విందు.. హ్హహ్హహ్హ అంటూ అందరూ సుష్టుగా కానిచ్చేశారు. వెళ్లింది ఐదుగురు.. బిల్లు చూస్తే 8వేలు. ఇంతేనా, అంటూ జేబులో చేయి పెట్టారు. వ్యాలెట్ కనిపించలేదు. నగదు, బ్యాంకు కార్డులు కూడా అందులోనే ఉన్నాయే...! మొహం ఒక్కసారిగా రూపు మారిపోయింది. వారిలో ఓ స్నేహితుడికి పరిస్థితి చెప్పి అతనితో బిల్లు కట్టించి అక్కడి నుంచి బయటపడ్డారు. 
ఇలాంటి పరిస్థితిని ఎలా ఊహిస్తాం చెప్పండి? ఇదే అని కాదు జేబులో ఉన్న నగదుకు, వ్యాలెట్ కు భద్రత ఉంటుందని చెప్పలేము కదా. అందుకే జేబులో రూపాయి లేకపోయినా బిల్లులు చెల్లించడానికి ఏ మాత్రం వెనకాడక్కర్లేదు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ పీసీఐ) తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) విధానం బ్యాకింగ్ ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లనుంది. బ్యాంకింగ్ లావాదేవీల నిర్వహణను చాలా సులభతరం చేయనుందని ఆ రంగానికి చెందిన నిపుణులు అంటున్నారు. యూపీఐ యాప్ తో ఎవరికైనా క్షణాల్లో నగదు పంపుకోవచ్చు. అన్ని రకాల బిల్లులు చెల్లించవచ్చు. పర్సుతో పని లేకుండా చేసే యూపీఐతో ఎన్నో సౌలభ్యాలు ఉన్నాయి. నగదు లావాదేవీలను తగ్గించడమే ఈ విధానం వెనుక ముఖ్య ఉద్దేశం. ఐఎంపీఎస్ కు మెరుగైన విధానమే యూపీఐ విధానం. 


వాస్తవానికి క్రెడిట్, డెబిట్ కార్డులు ఉన్నా... ఇప్పటికీ ఎక్కువ మంది నగదుతోనే లావాదేవీలు నిర్వహిస్తున్నారు. బ్యాంకు ఏటీఎం కేంద్రాల్లో ఉచిత నగదు లావాదేవీలు పరిమితం చేయడంతో నగదును డ్రా చేసుకుని వినియోగిస్తున్న వారు కూడా పెరిగారు. జేబులో నగదు ఉంటే కార్డులతో పనే ఉండదు. కానీ యూపీఐ మొబైల్ యాప్ ఉంటే ఇవేమీ లేకపోయినా ఫర్వాలేదు!. దేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిపోతుండడంతో మొబైల్ వ్యాలెట్ల వినియోగం కూడా క్రమంగా పెరుగుతూ వస్తోంది.

చాలా సులభం

ప్రస్తుతం పేటీఎం, మొబిక్ విక్, పేయూ మనీ ఇలా పలు రకాల మొబైల్ వ్యాలెట్ యాప్ లు ఉన్నాయి. ఇవన్నీ కూడా థర్డ్ పార్టీ యాప్స్. ముందుగా ఆయా వ్యాలెట్లలో నగదు నిల్వ చేసుకుని లేదా నగదు పంపుకుని గానీ అక్కడి నుంచి చెల్లింపులు చేయడం సాధ్యం కాదు. యూపీఐ మాత్రం నేరుగా బ్యాంకు ఖాతా నుంచే నగదు లావాదేవీలను పూర్తి చేస్తుంది. ప్రస్తుతం దాదాపుగా చాలా బ్యాంకులకు ప్రత్యేకంగా యాప్స్ ఉన్నాయి. వీటి ద్వారా లావాదేవీలు చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. వాటితో పోల్చినా యూపీఐనే సౌలభ్యం అని నిపుణులు పేర్కొంటున్నారు. 
మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ ద్వారా లావాదేవీల నిర్వహణకు ఇతరుల ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్ సీ కోడ్ తదితర వివరాలు అవసరం. కొద్దిగా సంక్లిష్టమైన విధానం కావడంతో బ్యాంక్ యాప్స్ అంతగా ప్రజాదరణ పొందలేదు. ఇక డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా అన్ని వేదికల్లోనూ లావాదేవీలు చేయడం సురక్షితమని చెప్పలేము. వాటి వివరాలను తస్కరించి డబ్బులు డ్రా చేసుకుంటున్న ఘటనలు కూడా చూస్తున్నాం. పైగా ఆన్ లైన్ వేదికల్లో కార్డు వివరాలన్నింటినీ నమోదు చేయాల్సి రావడం ప్రయాసతో కూడుకున్నదే. కానీ యూపీఐ ఇలాంటి ప్రతికూలతలన్నింటినీ చెరిపేసి లావాదేవీలను సులభతరం, సురక్షితం చేస్తుందని నిపుణుల విశ్లేషణ.

లావాదేవీ ఇలా జరుగుతుంది...

ఎలా అంటే ఒకరికి ఎస్ బీఐలో ఖాతా ఉందనుకుందాం. మరొక వ్యక్తికి ఆంధ్రా బ్యాంకులో ఖాతా ఉందనుకుందాం. ఈ రెండు బ్యాంకులు యూపీఐ తో కనెక్ట్ అయి ఉంటే చాలు. అప్పుడు వీరిద్దరిలో ఎవరు కావాలంటే వారికి నగదు పంపుకోవడం, తీసుకోవడం చాలా సులభం. ఇందులో నగదు లావాదేవీలకు బ్యాంకు ఖాతా నంబర్ తో పని లేదు. ప్రతి ఒక్కరికీ వర్చ్యువల్ అడ్రస్ ఉంటుంది. అది ఎలా అంటే ఏబీసీ@ఎస్ బీఐ ఇదే వర్చ్యువల్ ఐడీ. ఇలా కాకుండా మొబైల్ నంబర్@ఎస్ బీఐ లేదా ఆధార్ నంబర్@ఎస్ బీఐ అని కూడా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎస్ బీఐ ఖాతాదారుడు ఒకరు యూపీఐ యాప్ ను తన మొబైల్ లో డౌన్ లోడ్ చేసుకుని వర్చువల్ ఐడీ పొంది ఉన్నాడనుకుందాం. అతడు ఫ్లిప్ కార్ట్ లో ఓ ఉత్పత్తిని చూసి కొనుగోలు చేయాలనుకున్నప్పుడు పేమెంట్ సెక్షన్ లో యూపీఐని సెలక్ట్ చేసుకోవాలి. అక్కడ వర్చువల్ ఐడీని ఇవ్వగానే కస్టమర్ మొబైల్ లోని యాప్ లో అలర్ట్ నోట్ కనిపిస్తుంది. సెక్యూర్డ్ పిన్ నంబర్ అక్కడ ఎంటర్ చేయడం ద్వారా లావాదేవీ పూర్తయిపోతుంది. అలాగే, సూపర్ మార్కెట్ కు వెళ్లి వెయ్యి రూపాయల సరుకులు కొన్నారు. బిల్లింగ్ కౌంటర్ దగ్గర వర్చువల్ ఐడీ చెప్పగానే తన మొబైల్ యాప్ లో లావాదేవీ ఆమోదం కోరుతూ నోట్ కనిపిస్తుంది. పిన్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా బ్యాంకు ఖాతా నుంచి నగదు సూపర్ మార్కెట్ ఖాతాకు బదిలీ అవుతాయి. 
ఉదాహరణకు శ్రీరామ్ కు ఎస్ బీఐ లో ఒక ఖాతా, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో ఒక ఖాతా ఉందనుకుందాం. ఈ రెండింటి మధ్య నగదు బదిలీ చేసుకోవాలంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా సాధ్యం. ఇందుకు ఆయా బ్యాంకు వెబ్ సైట్ లో లాగిన్ అయ్యి లావాదేవీ పూర్తి చేయడం, ఆ నగదు అవతలి వైపు ఖాతాలో జమ కావడానికి సమయం పడుతుంది. ఏ పేమెంట్ విధానంలో (ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ) పంపామన్నదానిపై ఈ సమయం ఆధారపడి ఉంటుంది. అలాగే, ఎస్ బీఐ, హెచ్ డీఎఫ్ సీ రెండు బ్యాంకుల మొబైల్ అప్లికేషన్లు శ్రీరామ్ మొబైల్ లో ఉన్నాయనుకుందాం. అప్పుడు ఆ రెండింటి మధ్య నగదు బదిలీ చేసుకోవాలంటే యాప్స్ వల్ల సాధ్యం కాదు. కానీ యూపీఐతో ఇది సాధ్యమే. ఎస్ బీఐ యాప్ లోకి వెళ్లి హెచ్ డీఎఫ్ సీ ఖాతా వర్చువల్ ఐడీతో నగదును ఎస్ బీఐ ఖాతాల జమ చేసుకోవచ్చు. అలాగే, ఎస్ బీఐ నుంచి హెచ్ డీఎఫ్ సీ ఖాతాక నగదు బదిలీ చేసుకోవచ్చు.

ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే...

బ్యాంకుకు అనుసంధానమైన యూపీఐ యాప్ లోకి లాగిన్ అయిన తర్వాత నగదు పొందాలంటే అవతలి వ్యక్తి వర్చువల్ ఐడీని, నగదు మొత్తాన్ని నమోదు చేయాలి. ఓకే చేసిన వెంటనే అవతలి వ్యక్తికి మొబైల్ యాప్ స్క్రీన్ పై నోటిఫికేషన్ కనిపిస్తుంది. సంబంధిత వ్యక్తి తన ఎంపిన్ నమోదు చేయగానే లావాదేవీ పూర్తయి నగదు మొత్తం వెంటనే మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. అదే విధంగా నగదును మరొకరికి బదిలీ చేయాలనుకుంటే సెండింగ్ మనీ/పేమెంట్ ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోవాలి. ఎవరికైతే నగదు పంపాలనుకుంటన్నామో ఆ వ్యక్తి వర్చువల్ ఐడీ, నగదు మొత్తాన్ని ఎంటర్ చేసి ఓకే చేసిన తర్వాత ఎంపిన్ ను నమోదు చేస్తే సరిపోతుంది. యూపీఐ ద్వారా లక్ష రూపాయల వరకు నగదు పంపుకోవచ్చు. ఒక లావాదేవీకి అర్ధరూపాయి మాత్రమే చార్జీ ఉంటుంది. 
ఏ లావాదేవీ పూర్తి కావాలన్నా... నమోదిత మొబైల్ నంబర్ నుంచే ఎంపిన్ ను ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో అక్రమాలకు ఆస్కారం ఉండదని ఎన్ పీసీఐ భావిస్తోంది. ఎందుకంటే ఎన్ పీసీఐ యూపీఐ ప్లాట్ ఫామ్ ద్వారా ఎంపిన్ నమోదు చేసిన తర్వాత ఆ పిన్ నంబర్ సరైనదేనా, నమోదిత మొబైల్ నంబర్ నుంచే వచ్చిందా, సిమ్ కార్డు సరైనదేనా అన్ని వివరాలను చెక్ చేసిన తర్వాతే లావాదేవీ పూర్తి చేస్తుంది. ఈ విధానం ద్వారా ఆన్ లైన్ షాపింగ్ చేసినప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకుని డెలివరీ సమయంలో నగదుతో పని లేకుండా యూపీఐ ద్వారా పేమెంట్ చేయవచ్చు. గ్యాస్ బిల్లు, విద్యుత్ బిల్లు ఇలా ప్రతీ పేమెంట్ ను యూపీఐ విధానంలో చేసే రోజు త్వరలో రానుంది. ఒక విధంగా నెట్ బ్యాంకింగ్, ఏటీఎంలు అందుబాటులోకి వచ్చిన తర్వాత బ్యాంకులకు వెళ్లి లావాదేవీలు నిర్వహించుకునే వారి సంఖ్య తగ్గింది. యూపీఐ ద్వారా అన్ని లావాదేవీలకు అవకాశం ఉండడంతో ఖాతాదారులు బ్యాంకులకు వెళ్లే అవసరం మరింత తగ్గుతుందని బ్యాకింగ్ నిపుణులు అంటున్నారు. 
భవిష్యత్తులో ఆధార్ బయోమెట్రిక్ విధానాన్ని తీసుకురావాలన్నది ఎన్ పీసీఐ ఆలోచన. అంటే ఎంపిన్ బదులు వేలిముద్ర వేయడం ద్వారానే లావాదేవీ పూర్తవుతుంది. వేర్వేరు బ్యాంకుల్లో ఖాతాలు ఉంటే విడిగా ప్రతీ బ్యాంకుకు ఒక వర్చువల్ ఐడీని క్రియోట్ చేసుకుని ఎంపిన్ పొంది ఉండాలి. తర్వాత వీటన్నింటినీ కలిపి ఒకటే ఐడీగా మార్చుకోవచ్చు. బ్యాంకులు ప్రస్తుతం తమ యాప్ లను యూపీఐకి అనుగుణంగా అప్ గ్రేడ్ చేసుకుంటున్నాయి. కొన్ని యూపీఐ ఎనేబుల్డ్ యాప్ ను విడుదల చేయనున్నాయి. అప్పుడు యూపీఐ యాప్ తో కాకుండా బ్యాంకు యాప్ ల ద్వారా కూడా యూపీఐ సేవలు పొందవచ్చు. 
‘పేమెంట్ చేయడానికి కార్డులు (క్రెడిట్, డెబిట్) ఉన్నాయి. మొబైల్ మనీ, ఇంటర్నెట్ ఈ వ్యాలెట్లు ఉన్నాయి. కానీ, ప్రత్యక్షంగా మొబైల్ ద్వారా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి నగదును పంపుకునే విధానం ఇప్పటి వరకూ లేదు అని యూపీఐ విధానానికి తన సలహాలు అందించిన యూఐడీఏ మాజీ చైర్మన్ నందన్ నీలేకని యూపీఐ యాప్ లాంచ్ కార్యక్రమం సందర్భంగా (ఏప్రిల్ 12న) అన్నారు.

జూన్ చివరి నాటికి

సో మొబైల్ ఒక్కటి ఉంటే చాలు ఇతరత్రా ఎలాంటి యంత్రాలు అవసరం లేదు. ఎంపిన్, వర్చువల్ ఐడీ గుర్తుంచుకుంటే చాలు. 29 బ్యాంకులు యూపీఐ విధానాన్ని అమలు చేయడానికి అంగీకరించగా... ప్రస్తుతానికి 19 బ్యాంకులు యూపీఐ విధానంలో చేరాయి. జూన్ చివరి నాటికి ఈ పేమెంట్ విధానం అందుబాటులోకి వస్తుందని ఎన్ పీసీఐ తెలిపింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏర్పాటు చేసిన సంస్థ. ప్రస్తుతం దేశంల ఐదు కోట్ల మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఉండగా... రానున్న ఐదేళ్ల కాలంలో వీరి సంఖ్య 50కోట్లకు చేరుకుంటుందని అంచనా. దీన్ని బట్టి భవిష్యత్తు అంతా మొబైల్ లావాదేవీల మయం కానుందని తెలుస్తోంది.



Sunday 19 March 2017

ఏటీఎం సెంటెర్స్ లో జరిగే మోసాలు ....తీసుకోవాల్సిన జాగ్రత్తలు...!


ఏటీఏం కార్డు లేని వారు నేడు చాలా అరుదు. వాడకం విస్తృతంగా పెరిగిపోవడంతో మోసగాళ్లు ఏటీఎం కేంద్రాలను అడ్డాగా చేసుకుంటున్నారు. ఏటీఎం కేంద్రాల్లో అజాగ్రత్తగా ఉంటే బ్యాంకు ఖాతాలో నగదు చోరుల చేతిలో పడినట్టే. కనుక తస్మాత్ జాగ్రత్త. 
ఏటీఎం కేంద్రంలోకి అడుగుపెడుతున్న దగ్గర నుంచి తిరిగి బయటకు వచ్చే వరకూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే ఏ రూపంలో నయినా మోసం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా జరుగుతుందా..? అనే రీతిలో మోసానికి గురి కావచ్చు. అందుకే ఏటీఎం మోసాలపై అవగాహన పెంచుకుని అప్రమత్తతతో వ్యవహరించాలి.

ఇలా జరుగుతాయి...

* ఏటీఎం మెషిన్ లో కార్డును ఇన్ సర్ట్ చేసే స్థలానికి కొంచెం పైన మోసగాళ్లు రహస్య కెమెరా అమర్చుతారు. కార్డులోని మేగ్నటిక్ స్ట్రిప్ ను రీడ్ చేసే పరికరాన్ని కూడా అక్కడ ఉంచుతారు. కార్డును ఇన్ సర్ట్ చేసి, పిన్ ఎంటర్ చేయడాన్ని ఈ కెమెరా రహస్యంగా చిత్రీకరిస్తుంది. కార్డు వివరాలు నేరగాళ్ల చేతికి చేరిపోతాయి. ఈ వివరాలతో వారు డూప్లికేట్ కార్డును ఇన్ సర్ట్ చేసి నగదును విత్ డ్రా చేసుకుంటారు. 
* మరో తీరులో కేటుగాళ్లు ఏటీఎం కేంద్రం వద్ద మాటు వేస్తారు. కార్డు స్లాట్ వద్ద గుర్తించలేని విధంగా ఇమిడిపోయే పరికరాన్ని అమరుస్తారు. ఒక్కసారి కార్డును ఇన్ సర్ట్ చేసి ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత... కార్డు బయటకు రాకుండా అది అడ్డుకుంటుంది. ఒకటి రెండు నిమిషాలు ప్రయత్నించి వెళ్లిపోతారు. ఆ తర్వాత అక్కడే ఉంచిన పరికరాన్ని తొలగించి లోపలున్న కార్డును పొందడం ద్వారా నగదును కొల్లగొడతారు. సాధారణంగా ఇలాంటి మోసాలు బ్యాంకులు పనిచేయని వేళ్లలో జరుగుతాయి. ఎందుకంటే ఫిర్యాదు ఇవ్వడానికి వెంటనే బ్యాంకు సిబ్బంది అందుబాటులో ఉండరు. దాంతో నేరగాళ్లు తమ పని సులభంగా పూర్తి చేసుకుని వెళతారు. 
* అలాగే, ఏటీఎం యంత్రం నుంచి నగదు బయటకు వచ్చే మార్గంలో ఓ పరికరాన్ని అమరుస్తారు. దాంతో నగదు బయటకు రాకుండా అక్కడే ఆగిపోతుంది. ఏటీఎం పనిచేయడం లేదని భావించి వెళ్లిపోతారు. ఆ తర్వాత అక్కడ ఆగిపోయిన నగదును మోసగాళ్లు తీసేసుకుంటారు. 
* కొన్ని ఏటీఎం మెషిన్లు నగదును బయటకు పంపేందుకు సమయం తీసుకుంటాయి. అన్ని వివరాలను ఎంటర్ చేసిన తర్వాత నగదు కౌంటింగ్ కూడా వెంటనే ప్రారంభం కాదు. చాలా నిదానంగా కొన్ని సెకన్ల తర్వాత మెషిన్ స్పందిస్తుంది. దీంతో ఏటీఎం మెషిన్లలో తిష్టవేసిన వ్యక్తి మెషిన్ సరిగా పని చేయడం లేదని మాయమాటలు చెబుతాడు. ఆ మాటలు నమ్మి క్యాన్సిల్ బటన్ నొక్కకుండా బయటకు వెళ్లామా... మెషిన్ నుంచి వచ్చే నగదు అతడి చేతిలో పడినట్టే.

ఒక ఉదాహరణ

చండీగఢ్ లో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన ఏటీఎం కేంద్రంలో ఓ మహిళ తన డెబిట్ కార్డును ఇన్ సర్ట్ చేసి పిన్ టైప్ చేసి కావాల్సిన నగదు మొత్తాన్ని ఎంటర్ చేసింది. తర్వాత ఓకే బటన్ ను ప్రెస్ చేయగా అది పని చేయలేదు. దాంతో నగదు బయటకు రాలేదు. అక్కడే ఉన్న ఓ యువకుడు జోక్యం చేసుకుని అకౌంట్ బ్యాలన్స్ బటన్ ను ఓకే చేశాడు. జోక్యం చేసుకోవద్దని అతడ్ని హెచ్చరించిన ఆమె మరోసారి తన కార్డును ఎంటర్ చేసి నగదు తీసుకునేందుకు ప్రయత్నించగా మళ్లీ అదే పరిస్థితి. ఒకటికి నాలుగు సార్లు ఎంటర్ కీ నొక్కడంతో స్క్రీన్ నల్లగా మారిపోయింది. కొంత సేపు వేచి చూసినా అలానే ఉండడంతో ఆమె క్యాన్సిల్ బటన్ నొక్కగా... ఇన్ సర్ట్ యువర్ ఏటీఎం కార్డ్ అన్న మెసేజ్ రావడంతో బయటకు వెళ్లిపోయింది. 
దగ్గర్లోని ఎస్ బీఐ ఏటీఎం సెంటర్ కు వెళ్లి ఆమె రూ.2వేలు డ్రా చేసుకుంది. కానీ బ్యాలన్స్ చూస్తే మొత్తం 17వేలు విత్ డ్రా చేసినట్టు కనిపించింది. సెల్ ఫోన్ చూసుకుంటే రూ.15వేలు, రూ.2వేల మేర రెండు లావాదేవీలు జరిగినట్టు ఎస్ఎంఎస్ లు కనిపించాయి. ఇది ఎలా జరిగిందన్నది ఆమెకు అంతుబట్టలేదు. బ్యాంకు టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయడంతో వాళ్లు నమోదు చేసుకున్నారు. ఏటీఎం ఎర్రర్, నగదు ఆటోమేటిక్ గా ఖాతాకు జమ అవుతాయని బదులిచ్చారు. ఏడు రోజులు ఆగమన్నారు. కానీ నగదు రాలేదు. మళ్లీ టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయగా... కార్డును బ్లాక్ చేసుకుని, మోసం జరిగినట్టు ఫిర్యాదు ఇవ్వమన్నారు. ఆ తర్వాత బ్యాంకు సైబర్ క్రైమ్ పర్యవేక్షక బృందం విచారణ చేపడుతుందని సెలవిచ్చారు. ఆమె సందేహంతో బ్యాంకుకు వెళ్లి విచారించింది. 
కార్డు బ్లాక్ చేసుకోవద్దని బ్యాంకు సిబ్బంది సలహా ఇచ్చారు. ‘fraud occurred due to malfunctioning of pnb atm machine’ అని మెయిల్ పెట్టమన్నారు. ఆమె అలానే చేసింది. దీంతో పీఎన్ బీ ఐటీ విభాగం స్పందించింది. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, జరిగింది నిజంగా మోసమేనని జవాబిచ్చింది. వీడియో ఫుటేజీల కోసం వెండర్ ను కోరినట్టు తెలిపింది. కానీ, తప్పిదం జరిగిన రోజున బ్యాంకు ఏటీఎం కేంద్రంలోని సీసీ టీవీ ఫుటేజీ అందుబాటులో లేదని తర్వాత మరో సమాధానం వచ్చింది. 
దీంతో గత్యంతరం లేక ఆమె బ్యాంకింగ్ అంబుడ్స్ మెన్ ను ఆశ్రయించింది. అప్పుడు బ్యాంకు దారికి వచ్చింది. సీసీ టీవీ ఫుటేజీ బ్యాంకు శాఖలో అందుబాటులో ఉందని దాన్ని పరిశీలించాలని కోరింది. ఆ తర్వాత తాము చర్యలు తీసుకుంటామని సమాధానమిచ్చింది. కానీ, ఈ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. మరోవైపు ఆమె పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. ఏటీఎం మెషిన్ ను హ్యాంగ్ చేసి నగదును కొల్లగొట్టినట్టు తెలుస్తోంది.

ఇదో నయా మోసం

2014లో కార్పొరేషన్ బ్యాంకు ఏటీఎం మెషిన్లలో డబ్బులు నింపే సీఎంఎస్ ఏజెన్సీ సంస్థకు చెందిన కొందరు ఉద్యోగులు కొత్త పద్ధతిలో మోసాలకు పాల్పడ్డారు. నాలుగు నెలల కాలంలో రూ.66.58 లక్షలను కొల్లగొట్టారు. ఏటీఎం యంత్రంలో కార్డును ఇన్ సర్ట్ చేసి అన్ని వివరాలను ఎంటర్ చేసిన తర్వాత లోపల్నుంచి నగదు బయటకు వస్తుందని తెలుసు కదా. కానీ, వీరు నగదు బయటకు రాకుండా చేయి అడ్డు పెట్టారు. దీంతో అది వెనక్కి వెళ్లిపోయి తిరిగి ఖాతాలో జమైంది. అడ్డు పెట్టిన చేయి తీసిన వెంటనే అంతకుముందు నమోదు చేసిన లావాదేవీ తాలూకు నగదు మొత్తం బయటకు వచ్చే లోపాన్ని వారు తమ మోసానికి అవకాశంగా మార్చుకున్నారు. ఫలితంగా బ్యాంకు ఖాతాల్లో నగదు బ్యాలన్స్ నుంచి కొట్టేయకుండా, బ్యాంకు సొమ్మును కాజేశారు. దీనిపై కేసు కూడా నమోదైంది.

జాగ్రత్తలతో భద్రం

* స్క్రీన్ లాక్ లేదా హ్యాంగ్ అయిన సందర్భాల్లో వెంటనే సెక్యూరిటీ గార్డును పిలిచి సాయం కోరాలి. అనుమానితులున్నట్టు చెప్పాలి. 
* లావాదేవీ నిర్వహిస్తున్న సమయంలో ఇతరులను అనుమతించవద్దు. 
* సెక్యూరిటీ లేని ఏటీఎం కేంద్రాలను వాడుకోవద్దు. రాత్రి సమయాల్లో, బ్యాంకులు పనిచేయని వేళ్లల్లో అత్యవసరమైతే తప్ప ఏటీఎంలను వాడవద్దు. జన సమ్మర్థ ప్రాంతాల్లోని ఏటీఎంలను వినియోగించడం భద్రత రీత్యా నయం. 
* కొంత మంది ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా 500 రూపాయల చొప్పున ఏటీఎంలలో డ్రా చేస్తుంటారు. వీలయితే తరచూ లావాదేవీలను తగ్గించడం నయం. 
* కార్డు కోల్పోతే వెంటనే బ్యాంకు టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి బ్లాక్ చేయించుకోవాలి. కార్డు మెషిన్ లోపల ఇరుక్కుపోతే కస్టమర్ కేర్ నంబర్ కు అక్కడి నుంచే కాల్ చేయండి. తరచూ పిన్ నంబర్ కూడా మార్చుకోవాలి. 
* పిన్ నంబర్ ఎంటర్ చేసే సమయంలో మరో చేయిని అడ్డంగా పెట్టుకోవాలి. బ్యాంకు ఎస్ఎంఎస్ అలర్ట్స్ మెసేజ్ సదుపాయాన్ని యాక్టివేట్ చేసుకోవడం నయం. 
* కార్డును ఇన్ సర్ట్ చేసే ముందు అక్కడ ఏదైనా అనవసరపు పరికరాలను అమర్చారా? లేదా? అన్నది పరిశీలించుకోవాలి. 
* కార్డు స్లాట్ వద్ద అనుమానిత వస్తువు ఏదైనా కనిపిస్తే వెంటనే బ్యాంకు సిబ్బందికి తెలియజేయాలి. 
* ఏటీఎం కార్డు వెనుక సీవీవీ అని మూడు అంకెలు ఉంటాయి. దాన్ని గుర్తు పెట్టుకుని కార్డుపై చెరిపేయండి. కార్డు వెనుక భాగంలో సిగ్నేచర్ కాలమ్ వద్ద తప్పకుండా సంతకం చేయాలి.

బ్యాంకులదే బాధ్యత

ఏటీఎం మెషిన్ ను ఏర్పాటు చేసింది బ్యాంకే. కనుక మోసాలు, అక్రమాలు జరగకుండా నివారణ, భద్రతా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత బ్యాంకులపైనే ఉంటుంది. లావాదేవీలు నిర్వహిస్తున్న సమయంలో వేరెవరూ లోపలికి చొరబడకుండా బ్యాంకులే తగిన ఏర్పాట్లు చేయాలి. ఇలా బ్యాంకులవైపు ఉన్న లోపాలకు కస్టమర్లు ఎందుకు నష్టపోవాలి. అందుకే ఏ బ్యాంకు ఏటీఎం కేంద్రంలో తప్పిదం జరిగిందన్న దానితో సంబంధం లేకుండా కస్టమర్ తనకు ఖాతా ఉన్న బ్యాంకు శాఖలో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. బ్యాంకు టోల్ ఫ్రీ, కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. బ్యాంకులు స్పందించకుంటే వివిధ మార్గాల్లో (అంబుడ్స్ మెన్, వినియోగదారుల ఫోరం, న్యాయస్థానం) న్యాయ సహాయం పొందవచ్చు.

HEALTH TIPS: BEST HOME REMEDIES FOR CRACKED HEELS

శీతాకాలం... వేసవి కాలం.. కొందరిని వర్షాకాలంలోనూ కాలి పగుళ్ల సమస్య తీవ్రంగా వేధిస్తుంటుంది. ఈ సమస్య కారణంగా చూడడానికి పాదాలు ఎబ్బెట్టుగా కనిపిస్తాయి. స్త్రీలకు అందమైన పాదాలు ఓ పెద్ద అసెట్ అని తెలిసిందే కదా.. చాలా మంది రకరకాల చిట్కాలు పాటిస్తుంటారు... మరికొందరు వైద్యుల సలహాతో వివిధ రకాల మందులు వాడినా ఆశించిన ఫలితం లేక విసుగు చెందిన వారూ ఉంటారు. అలాంటి వారికి నిపుణులు సూచిస్తున్న ఈ చిట్కాలను గురించి తెలుసుకుందాం. 
తగినంత తేమ లేకపోవడం, ఎక్కువగా తడిలో పాదాలు నానుతుండడం, మురికికి ఎక్కువగా ఎక్స్ పోజ్ కావడం కాలి పగుళ్ల సమస్యకు ప్రధాన కారణాలు. అధిక శాతం మందికి పాద సంరక్షణపై పెద్దగా శ్రద్ధ ఉండదు. పగుళ్ల సమస్యను నిర్లక్ష్యం చేస్తే పాదాలు ఎర్రబారి, వాచి తీవ్రమైన నొప్పికి దారి తీస్తుంది. ఫంగల్ ఇన్ ఫెక్షన్ కూడా దారి తీయవచ్చు. 

* కొవ్వొత్తి వెలుగునివ్వడమే కాదు పాదాలకు ఓ రూపునిస్తుంది. మైనం ఆవనూనె తో కలిపి రాత్రి పూట పగుళ్లపై రాసి చూడండి. తెల్లవారే సరికి మార్పును గమనిస్తారు. 
* గ్లిజరిన్, రోజ్ వాటర్ తో కలిపి ప్రతి రోజూ రాత్రి నిద్రించడానికి ముందు.. అలా 15 రోజుల పాటు రాసి చూడండి. 
* నువ్వుల నూనె కూడా ఈ సమస్య నివారణకు పనిచేస్తుందట. నిద్రించే ముందు పాదాలకు మర్ధన చేయాలి. 
* అరటి పండు గుజ్జు కూడా పగుళ్లపై మంచి ఔషధంగా పనిచేస్తుంది. పగుళ్లు తొందరగా మానిపోయేలా చేస్తుంది. 
* పసుపు, తులసి , కర్పూరం సమాన మొత్తాల్లో తీసుకుని వీటికి అలోవెరా జెల్ కలిపి రాసి చూస్తే మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు నిపుణులు.

Saturday 18 March 2017

విటమిన్లలో రకాలు మరియు ఆరోగ్యకర జీవితానికి వాటి ఆవశ్యకత.

మనం ఏదైనా పనిచేయాలంటే శక్తి అవసరం. ఆహారం జీర్ణమై గ్లూకోజ్ గా మారి దాని నుంచి మనకు శక్తి అందుతుంది. కానీ శరీరంలోని జీవక్రియలన్నీ సక్రమంగా సాగాలంటే కేవలం శక్తి సరిపోదు దానికి మరెన్నో ముఖ్యమైన పదార్థాలు కావాలి. వాటిలో అతి ముఖ్యమైనవి విటమిన్లు. సాధారణంగా మనం తినే ఆహారం ద్వారానే మనకు విటమిన్లు అందుతాయి. అలా అందే విటమిన్లు సరిపోని పక్షంలోగానీ, అత్యవసర పరిస్థితుల్లోగానీ విటమిన్లను మాత్రల రూపంలో శరీరానికి అందించవచ్చు. కానీ ఇలా మాత్రల రూపంలో అందించడంపై శాస్త్రవేత్తలు, వైద్యుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. అంతేగాకుండా కొన్ని విటమిన్లను నిర్ణీత మోతాదులో మాత్రమే తీసుకోవాలి. మోతాదు ఎక్కువైన పక్షంలో ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మరణం కూడా సంభవించవచ్చు. అందువల్ల కచ్చితంగా వైద్యుల సలహా మేరకు మాత్రమే విటమిన్ మాత్రలను తీసుకోవాలి. అసలు ఈ విటమిన్లు ఏమిటి, అవి లోపిస్తే వచ్చే ఆరోగ్య సమస్యలు, విటమిన్లు ఎక్కువగా లభించే ఆహారం ఏమిటో తెలుసుకుందాం..

విటమిన్లలో ఏడు రకాలు

ఏ, బీ, సీ, డీ, ఇ, కె రకాలుగా విటమిన్లు ఉంటాయి. వీటిని రెండు విధాలుగా వర్గీకరిస్తారు. నీటిలో కరగనివి ఏ, డీ, ఈ, కె విటమిన్లు.. ఇవి కొవ్వు పదార్థాలలో కరుగుతాయి. బీ, సీ విటమిన్లు నీటిలో కరుగుతాయి. నీటిలో కరగని విటమిన్లు మన శరీరానికి స్వల్ప మోతాదుల్లో అవసరం. కానీ అత్యావశ్యకం. ఇవి కొన్ని రకాల ఆహార పదార్థాల్లోనే లభిస్థాయి. అదే నీటిలో కరిగే విటమిన్లు మనకు చాలా రకాల ఆహార పదార్థాల్లో ఉంటాయి. కానీ మారుతున్న జీవన శైలి, ఆహార అలవాట్ల కారణంగా ఇవి కూడా లోపిస్తున్నాయి. ఏ, డి, ఇ, కె విటమిన్లు ఆహార పదార్థాలను వేడి చేసినా దెబ్బతినవు. కానీ బీ, సి విటమిన్లు మాత్రం ఓ స్థాయికి మించి ఆహార పదార్థాలను వేడిచేస్తే నశించిపోతాయి. అందువల్ల విస్తృతంగా లభించినా కూడా బి, సి విటమిన్ల లోపాలు ఏర్పడుతుంటాయి.

మంచి కంటి చూపునకు.. విటమిన్ ఏ

మంచి కంటి చూపు, నిగనిగలాడే చర్మం, కండరాల పటుత్వానికి విటమిన్ ఏ తోడ్పడుతుంది. శరీరంలో ఫ్రీర్యాడికల్స్ ను నియంత్రించే యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. పిల్లల్లో మంచి ఎదుగుదలకు తోడ్పడుతుంది. శరీరంలో కణాలు దెబ్బతినడాన్ని నిరోధిస్తుంది. రక్తనాళాలు, వివిధ అవయవాలపై పొరల్లో ఉండే కణజాలం రక్షణకు తోడ్పడుతుంది. దంతాలు, రోగ నిరోధక వ్యవస్థ, వివిధ అవయవాలను ఆవరించి ఉండే మ్యూకస్ పొరలు ఆరోగ్యంగా ఉండడానికి సహకరిస్తుంది. మన శరీరంలో ఉండే మొత్తం విటమిన్ ఏ లో 80 నుంచి 90 శాతం కాలేయంలోనే నిల్వ ఉంటుంది. 
విటమిన్ ఏ పనితీరుపై అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ప్రొవిడెన్స్ సెయింట్ జాన్స్ హెల్త్ సెంటర్ వైద్య శాస్త్రవేత్త షెర్రీ రాస్ పరిశోధన చేశారు. శరీరంలో కణాల విభజన, పెరుగుదలతోపాటు గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీల వంటి ముఖ్యమైన అవయవాలు సరిగ్గా పనిచేయడానికి విటమిన్ ఏ తోడ్పడుతుందని చెప్పారు. ఇది పెద్దవారిలో పురుషులకు రోజుకు 900 మైక్రోగ్రాములు, మహిళలకు 700 మైక్రోగ్రాములు అవసరం. వరిలో విటమిన్ ఏ అతి తక్కువగా ఉంటుంది. అందువల్ల వరిని ప్రధాన ఆహారంగా తీసుకునే మన దేశంతోపాటు దక్షిణ, తూర్పు ఆసియా దేశాల వారిలో దీని లోపం ఎక్కువగా కనిపిస్తుంది. 
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) గణాంకాల ప్రకారం విటమిన్ ఏ లోపం కారణంగా ఏటా ప్రపంచవ్యాప్తంగా రెండు లక్షల నుంచి ఐదు లక్షల మంది చిన్నారులు అంధత్వం బారిన పడుతున్నారు. చూపు కోల్పోయిన 12 నెలల్లోపే వారిలో సగం మంది వరకూ మరణిస్తున్నారు. రక్తంలోని సీరంలో ఉండే రెటినాల్ స్థాయులను పరీక్షించడం ద్వారా విటమిన్ ఏ లోపాన్ని గుర్తించవచ్చు. సాధారణ వ్యక్తుల రక్తంలో 28 నుంచి 86 మైక్రోగ్రాములు విటమిన్ ఏ ఉండాలి. 28 మైక్రోగ్రాముల కంటే తక్కువగా ఉంటే లోపమున్నట్లే. అయితే ఈ లోపాన్ని గుర్తించేనాటికి చాలా ముందు నుంచే విటమిన్ ఏ శరీరానికి అందడం లేదని లెక్క. ఎందుకంటే ఎక్కువగా తీసుకునే విటమిన్ ఏ పెద్ద మొత్తంలో కాలేయంలో నిల్వ అవుతూ.. అవసరమైనప్పడు విడుదలవుతూ ఉంటుంది. లోపం ఏర్పడేనాటికి కాలేయంలోనూ విటమిన్ ఏ నిల్వ శూన్యమవుతుంది. ఇక కంటి చూపు దెబ్బతిన్నప్పుడు ‘రాడ్ స్కోటోమెట్రీ, ఎలక్ట్రోరెటీనోగ్రఫీ’ పరీక్షల ద్వారా అది విటమిన్ ఏ లోపం కారణంగానా? లేక మరేదైనా కారణంగానా? అనేది గుర్తిస్తారు.

లోపిస్తే ఎన్నో సమస్యలు

విటమిన్ ఏ లోపం చాలా వరకు పోషకాహార లోపం కారణంగానే ఏర్పడుతుంది. ముఖ్యంగా బియ్యాన్ని వినియోగించే అన్నం, రొట్టెలను ప్రధాన ఆహారంగా తీసుకునే ప్రాంతాల్లో ఈ లోపం ఎక్కువ. దీంతోపాటు కొవ్వులు వంటి కొన్ని రకాల ఆహార పదార్థాలను జీర్ణం చేసుకోవడంలో లోపం, కాలేయ సంబంధిత వ్యాధులతోనూ విటమిన్ ఏ లోపం ఏర్పడుతుంది. కంటిలోని రెటీనాలో రొడాప్సిన్ అనే వర్ణద్రవ్యం ఏర్పడడానికి రెటినాల్ అత్యవసరం. ఇది లోపిస్తే దృష్టి మందగిస్తుంది. రేచీకటి వస్తుంది. కన్నీరు ఉత్పత్తి కాకపోవడంతో పొడి కళ్ల సమస్య వస్తుంది. రంగులను గుర్తించే శక్తి సన్నగిల్లుతుంది. చివరికి పూర్తిగా కళ్లు కనబడని పరిస్థితి కూడా రావొచ్చు. 
ఇక దీని లోపం కారణంగా చర్మం సున్నితత్వాన్ని కోల్పోయి గరుకుగా మారుతుంది. ప్రత్యుత్పత్తి చర్యలపైనా ప్రభావం పడుతుంది. ఊపిరితిత్తుల చుట్టూ ఉండే మ్యూకస్ పొర దెబ్బతిని.. శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. విటమిన్ ఏ ను సప్లిమెంట్ల రూపంలో తీసుకోవచ్చు. అయితే దీని మోతాదు మించితే ఏర్పడే దుష్పరిణామాలు చాలా ప్రమాదకరం. దీర్ఘకాలం పాటు ఎక్కువ మోతాదులో విటమిన్ ఏ ను తీసుకుంటే.. కాలేయం దెబ్బతింటుంది. చర్మం, నరాల సంబంధిత సమస్యలు, వెంట్రుకలు రాలిపోవడంతో పాటు ఎముకలు గుల్లబారిపోవడం వంటివి తలెత్తుతాయి.

పిల్లలకు అత్యవసరం..

ముఖ్యంగా చిన్న పిల్లల్లో విటమిన్ ఏ అవసరం చాలా ఎక్కువ. దీని లోపం వల్ల వారిలో ఎదుగుదల మందగిస్తుంది. దృష్టి లోపం సమస్యలు తలెత్తుతాయి. లోపం వల్ల కంటి ముందుభాగంలో ఉండే కార్నియా మెత్తగా మారి పగిలిపోతుంది. దాని కారణంగా శాశ్వత అంధత్వం వస్తుంది. కంటిలో పువ్వు (తెల్లని చుక్కలు) ఏర్పడుతుంది. ముఖ్యంగా చిన్నారులు పలు రకాల ఇన్ఫెక్షన్లకు సులువుగా లోనవుతారు. ఇతరత్రా ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే విటమిన్ ఏ లోపం వల్ల అవి మరింతగా పెరిగిపోతాయి. మీజిల్స్ (తట్టు) సంక్రమించిన పిల్లల్లో వ్యాధి లక్షణాలను తగ్గించడంలో విటమిన్ ఏ బాగా తోడ్పడుతుంది.

ఇవి తింటే చాలు..

విటమిన్ ఏలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి జంతు సంబంధ పదార్థాల్లో ఉండే రెటినాల్. రెండోది వృక్ష సంబంధమైన వాటిలో ఉండే బీటా కెరోటిన్. ఈ బీటా కెరోటిన్ మన కాలేయం, పేగుల్లో రెటినాల్ గా మారుతుంది. 
- రెటినాల్ ఎక్కువగా లభించే ఆహారం పాలు, గుడ్లు, మాంసం, వెన్న, కాలేయం, చేపనూనె, కిడ్నీలు. 
- బీటా కెరోటిన్ ఎక్కువగా ముదురు రంగులో, ఎక్కువ ప్రకాశవంతమైన రంగుల్లో ఉండే పండ్లు, కూరగాయల్లో లభిస్తుంది. ఇంకా ఆకు కూరలు, ఆరెంజ్, క్యారెట్లు, చిలగడ దుంప, గుమ్మడి, బ్రాకొలి, ఆప్రికాట్, తృణధాన్యాలు వంటి వాటిలో ఎక్కువగా ఉంటుంది.

విటమిన్ డి - ఎముకల దృఢత్వం కోసం..

దృఢమైన ఎముకలు, బలమైన కండరాలు, మంచి రోగ నిరోధక శక్తికి విటమిన్ డి అత్యవసరం. దీని రసాయనిక నామం కాల్సిఫెరాల్. శరీరానికి అత్యవసరమైన కాల్షియం, ఫాస్పేట్లు పేగుల నుంచి రక్తంలో కలిసేందుకు ఇది తోడ్పడుతుంది. ఎముకల నిర్మాణంలో కీలకంగా వ్యవహరిస్తుంది. మితిమీరిన కణ విభజనను నియంత్రించి కేన్సర్ వచ్చే పరిస్థితిని నివారిస్తుంది. కండరాలు, నాడులు సరిగా పనిచేసేందుకు తోడ్పడుతుంది. మన దేశంలో దాదాపు 90 శాతం మందికి ఎంతో కొంత విటమిన్ డి లోపం ఉందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సూర్యరశ్మి తగలకపోవడం, విటమిన్‌ డి లేని ఆహారం తీసుకోవడం, పారా థైరాయిడ్‌ గ్రంథి పనితీరు దెబ్బతినటం, లివర్‌ వ్యాధులు, కిడ్నీ జబ్బుల వంటి సందర్భాల్లో విటమిన్‌-డి లోపం తలెత్తుతుంది 
. ఊబకాయుల శరీరంలో విటమిన్ డి కొవ్వులోనే నిక్షిప్తమై ఉంటుంది. దాంతో వారిలో దీని లోపం కనిపిస్తుంది. 50 ఏళ్లలోపు వారికి రోజుకు 200 ఐయూ (ఇంటర్నేషనల్ యూనిట్లు), 50 నుంచి 70 ఏళ్ల మధ్య వయసు వారికి రోజుకు 400 ఐయూ, 70 ఏళ్లు పైబడిన వారికి 600 ఐయూ విటమిన్ డి అవసరం. ముఖ్యంగా రుతుక్రమం నిలిచిపోయిన మహిళలకు విటమిన్ డి అవసరం చాలా ఎక్కువ. మరోవైపు ఆహారం ద్వారా అందిన, సూర్యరశ్మితో చర్మం తయారు చేసిన విటమిన్ డి మొత్తాన్నీ శరీరం యథావిధిగా వినియోగించుకోలేదు. అందులో కొంత వృధాగా పోతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ రోజుకు 700 నుంచి 1,000 ఐయూ వరకూ విటమిన్ డి అందేలా చూసుకోవాలి. ఇక ఈ విటమిన్ లో మరిన్ని ఉప రకాలు ఉన్నా.. డీ2, డీ3లు మనకు అవసరం. బ్రెస్ట్, ప్రొస్టేట్ కేన్సర్లను, ల్యూకేమియా (రక్త కేన్సర్)ను నిరోధించడంలో విటమిన్ డి కీలకంగా పనిచేస్తుందని పలు పరిశోధనల్లో ప్రాథమికంగా గుర్తించారు. కానీ పూర్తి స్థాయిలో నిర్ధారణ కాలేదు.

లోపిస్తే జీవితాంతం కష్టాలే..

మనం నిత్యం పనిచేసుకోవడానికి, కనీసం నిలబడడానికి ఎముకలు దృఢంగా ఉండడం అవసరం. విటమిన్ డి లోపిస్తే ఎముకలకు కాల్షియం అందక గుల్లబారిపోతాయి. దానివల్ల చిన్నపాటి ఒత్తిడికి గురయినా విరిగిపోతాయి. చిన్న పిల్లల్లో దొడ్డి కాళ్లు, ఛాతీ ఎముకలు ముందుకు వచ్చి పంజరంలా మారిపోయే రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. 20 నుంచి 40 ఏళ్ల వయసువారిలో ఆస్టియో మలేసియా, నాడుల బలహీనత ఏర్పడుతుంది. పెద్ద వయసు వారు, వృద్ధుల్లో ఆస్టియో ఫ్లోరోసిస్, ఆస్టియో పీనియా, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇక విటమిన్ డి లోపం వల్ల ఆకలి మందగించటం, బరువు తగ్గిపోవడం, నిద్రలేమి, నిస్సత్తువ, నిస్త్రాణ, కండరాల నొప్పులు, ఒళ్లు నొప్పుల వంటి సమస్యలు తలెత్తుతాయి. 
రోగ నిరోధక వ్యవస్థలో కీలకమైన తెల్త రక్త కణాల్లో చురుకుదనం తగ్గిపోయి రకరకాల వ్యాధులు, రుగ్మతలు వెంటాడుతాయి. చిన్న పిల్లల్లో టైప్-1 మధుమేహం రావడానికి విటమిన్ డి లోపం కూడా కారణమని పరిశోధకులు గుర్తించారు. అంతేగాకుండా పలు రకాల కేన్సర్లు ముప్పు కూడా పెరుగుతుందని తమ అధ్యయనాల్లో తేల్చారు. ఏ వయసు వారిలోనైనా కండరాల్లో నొప్పులు, కండరాలు బలహీనం కావడం, కీళ్ల నొప్పులు విటమిన్ డి లోపానికి ప్రథమ సూచికలు. అలాగే తాజా పరిశోధనల్లో, విటమిన్ డి లోపం వల్ల డిప్రెషన్ (కుంగుబాటు) అనే మానసిక వ్యాధికి కూడా గురవుతున్నట్టు వెల్లడైంది. ఆల్కలీన్ ఫాస్పటేజ్, పారాథార్మోన్, 25హైడ్రాక్సి కోలీ కాల్సిఫెరాల్ పరీక్షల ద్వారా విటమిన్ డి లోపాన్ని గుర్తించవచ్చు. ఎముకలు బలహీనం కావడాన్ని ఎక్స్ రేల ద్వారా గమనించవచ్చు.

వృద్ధులూ జాగ్రత్త..

పెద్ద వయసు వారిలో చర్మం ముడతలు పడి, గరుకుగా మారిపోయి ఉండడంతో.. వారిలో విటమిన్ డి తక్కువగా తయారవుతుంది. దానితోపాటు వయసుతో వచ్చే ఎముకలు గుల్లబారిపోవడం, కీళ్ల అరుగుదల వంటి సమస్యలూ ఎక్కువ. అందువల్ల 50 ఏళ్ల వయసుపైబడిన వారిలో విటమిన్ డి అవసరం చాలా ఎక్కువ. అంతేకాదు వారు విటమిన్ డి తోపాటు ఆహారంలో కాల్షియం, ఫాస్పరాస్ లు సరిపోయే మోతాదులో ఉండే ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. లేకపోతే చిన్నపాటి ఒత్తిడికే ఎముకలు విరిగిపోయి, వెన్నుపూస దెబ్బతిని జీవితం చివరి దశలో ఎన్నో బాధలు పడాల్సి వస్తుంది.

కాస్త ఎండలో గడపండి

విటమిన్ డి దొరికే ఆహార పదార్థాలు అతి స్వల్పం. దీనిని పొందడానికి చేయాల్సిన ముఖ్యమైన పని ఎండలో నిలబడడమే. సూర్యరశ్మిని గ్రహించడం ద్వారా మన చర్మం విటమిన్ డిని తయారుచేసుకుంటుంది. తెల్లగా ఉన్నవారికంటే కాస్త నలుపు చర్మం ఉన్నవారు ఎక్కువసేపు ఎండలో ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే నలుపు రంగులో ఉన్న చర్మంలో మెలనిన్ సమర్థవంతంగా విటమిన్ డిని తయారుచేయలేదని పరిశోధనల్లో తేలింది. కాడ్ చేప నూనె, సాల్మన్ చేపలు, రొయ్యలు, పాలు, గుడ్లు, పుట్టగొడుగులు, పోషకాలు కలిపిన తృణధాన్యాల్లో కొంత వరకు విటమిన్ డి లభిస్తుంది. ఇక విటమిన్ డి లోపాన్ని గుర్తించిన పక్షంలో కేవలం ఎండలో నిలబడడం, ఆహారం ద్వారా వెంటనే అందే అవకాశం తక్కువ. అందువల్ల వైద్యుల సలహా మేరకు విటమిన్ డి మాత్రలు, ఇంజెక్షన్ల రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది.

మోతాదు మించొద్దు

విటమిన్ డి ని అధిక మోతాదులో తీసుకుంటే చాలా దుష్పరిమాణాలు తలెత్తుతాయి. బరువు తగ్గిపోవడం, నీరసం, అతిగా మూత్రం రావడం, గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయి. రక్త నాళాలు సాగే గుణాన్ని కోల్పోతాయి. శరీరంలో కాల్షియం మోతాదు ఎక్కువైపోయి అది విషపూరితంగా (టాక్సిసిటీ) మారుతుంది. ముఖ్యంగా గర్భిణులు దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విటమిన్ డి మోతాదు మించితే గర్భంలోని శిశువుకు హాని కలుగుతుంది. అయితే సాధారణంగా ఎండలో నిలబడడం ద్వారాగానీ, ఆహారం నుంచి గానీ అత్యధిక స్థాయిలో విటమిన్ డి లభించే అవకాశం లేదు. కేవలం విటమిన్ డి మాత్రలు, ఇతర సప్లిమెంట్లలో భాగంగా అందినప్పుడే మోతాదు మించుతుంది. అందువల్ల వైద్యులు సూచించిన మోతాదులో మాత్రమే విటమిన్ డి సప్లిమెంట్లను వినియోగించడం శ్రేయస్కరం.

అందానికి, ఆరోగ్యానికి.. విటమిన్ ఇ

మన అందానికి, ఆరోగ్యానికి, సంతానం పొందడానికి అత్యంత ముఖ్యమైనది విటమిన్ ఈ. దీనిని రసాయనికంగా ‘టోకోఫెరాల్’ అని పిలుస్తారు. దీనివల్ల శరీర పటుత్వం పెరుగుతుంది. మహిళల్లో ప్రత్యుత్పత్తి అవయవాలను రక్షించడంతోపాటు గర్భస్రావం కాకుండా నిరోధిస్తుంది. పురుషుల్లో శుక్రకణాల పనితీరును మెరుగుపరుస్తుంది. చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. దీనికి కొవ్వును కరిగించే శక్తి ఉంది. ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి శరీరంలోని ఫ్రీర్యాడికల్స్ ను, కేన్సర్ కారకాలను నిర్మూలిస్తుంది. గుండెకు మేలు చేస్తుంది. రక్తనాళాలు సాగే గుణాన్ని పెంచి అవసరమైన పరిస్థితుల్లో రక్తం సాఫీగా ప్రవహించడానికి సాయపడుతుంది. కంటి చూపు మెరుగుపడేందుకు, రక్త కణాల వృద్దికి తోడ్పడుతుంది. 
మెనోపాజ్ దశలో ఉన్న మహిళలకు వచ్చే సమస్యలను నివారిస్తుంది. రుతుక్రమం సమయంలోనూ మహిళలు ఎదుర్కొనే పొత్తికడుపు నొప్పి, నీరసం, ఒళ్లు నొప్పులను తగ్గిస్తుంది. ఊబకాయం సమస్యతో బాధపడుతున్నవారు విటమిన్ ఈ తీసుకోవడం వల్ల కొంత ఉపశమనం ఉంటుంది. 14 ఏళ్లు పైబడినవారికి రోజుకు 15 మిల్లీగ్రాముల విటమిన్ ఈ అవసరం. అదే పిల్లలకు పాలిస్తున్న మహిళలు 19 మిల్లీగ్రాములు తీసుకోవాలి. అయితే విటమిన్ ఈ అధికంగా తీసుకుంటే పలు దుష్పరిణామాలు తలెత్తుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ రోజుకు 1,000 మిల్లీగ్రాములకు మించి దీనిని తీసుకోకూడదు.

లోపిస్తే సంతాన సమస్య

విటమిన్ ఇ లోపానికి గురికావడమనేది చాలా తక్కువ. ఇది మనం నిత్యం వినియోగించే చాలా రకాల ఆహారపదార్థాల్లో లభించడమే దీనికి కారణం. అయితే కొన్నేళ్లుగా మారిన జీవన విధానం కారణంగా శరీరానికి విటమిన్ ఇ అందకుండా పోతోంది. నూనెలను ఎక్కువగా వేడి చేయడంతో వాటిల్లోని విటమిన్ నశిస్తుంది. ఇక ఎక్కువగా వేపుళ్లు, జంక్ ఫుడ్ కు అలవాటు పడడం వంటివాటితో శరీరానికి అవసరమైన విటమిన్ ఇ అందడం లేదు. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు విటమిన్ ఇ ఎంతో అవసరం. దీని లోపం వల్ల స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు సులువుగా ఇన్ఫెక్షన్లకు లోనవుతాయి. అండ వాహికలు మూసుకుపోతాయి. పురుషుల్లో వీర్యకణాల్లో చురుకుదనం లోపిస్తుంది. దీంతో సంతాన లేమి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. 
ఇక విటమిన్ ఇ లోపం వల్ల చర్మం కాంతి విహీనంగా తయారవుతుంది. రక్త హీనత, కండరాల బలహీనత, నీరసం, నరాల బలహీనత, మతి మరుపు, దృష్టి మందగించడం, రోగ నిరోధక వ్యవస్థ బలహీనం కావడం, నాడులు దెబ్బతినడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. గుండె సంబంధిత వ్యాధులు ఉండి రక్తాన్ని పలుచన చేసే మందులు వాడుతున్నవారు విటమిన్ ఇ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దీర్ఘకాలం పాటు విటమిన్ ఇ లోపం గనుక ఉంటే కాలేయం, కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఎక్కువ.

అజీర్ణం సమస్య ఉంటే మరింత జాగ్రత్త

తిన్న ఆహారం సరిగా జీర్ణం కాని సమస్యతో బాధపడుతున్నవారిలో కచ్చితంగా విటమిన్ ఇ లోపం ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు గ్యాస్, దీర్ఘ కాలిక మలబద్ధకంతో బాధపడుతున్నవారు, గ్యాస్ట్రో ఎంటరాలజీ చికిత్సలు తీసుకున్నవారిలో కొవ్వు పదార్థాలు జీర్ణమయ్యే అవకాశం తక్కువ. దీంతో విటమిన్ ఇ లోపం ఏర్పడుతుంది. 30 ఏళ్లుపైబడిన వారిలో ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువ.

మీ పిల్లలను గమనించండి

మూడు నుంచి ఆరు నెలలోపు శిశువుల్లో కొంత మందికి విటమిన్ ఇ లోపం కనిపించే అవకాశం ఉంటుంది. ఆ శిశువులకు కొవ్వు పదార్థాలను జీర్ణం చేసుకునే శక్తి ఉండదు. ఈ స్థితిని ‘అబెటలిపొప్రొటీనిమియా’ అంటారు. విటమిన్ ఈ కొవ్వు పదార్థాలలో మాత్రమే కరుగుతుంది. దాని ద్వారానే శరీరానికి అందుతుంది. కొవ్వు పదార్థాలు జీర్ణం కానప్పుడు వాటిల్లో ఉండే విటమిన్ ఇ కూడా అందక లోపం ఏర్పడుతుంది. శిశువుల్లో చర్మం పొడిబారిపోతుండడం, తరచూ అనారోగ్యానికి గురవుతుండడం ద్వారా దీనిని గుర్తించవచ్చు. అలాంటి వారికి తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణలో విటమిన్ ఈ తోపాటు తగిన చికిత్సను అందించాల్సి ఉంటుంది.

వీటిల్లో విటమిన్ ఇ

మనం తరచూ తీసుకునే ఆహార పదార్థాల నుంచే విటమిన్ 'ఇ'ని పొందవచ్చు. ముఖ్యంగా గోధుమ మొలకల్లో (వీట్ జర్మ్) ఇది చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. ఇక బాదం, వాల్ నట్స్, వేరుశనగ, పొద్దుతిరుగుడు, సోయాబీన్, నువ్వులు, ఆలివ్ నూనెలు, మొక్కజొన్న, ఆకుకూరలు, తృణధాన్యాలు, చిలగడ దుంప, గుడ్లు, కాలేయంలలో లభిస్తుంది.

గాయాలు మాన్పే.. విటమిన్ కె

మనకు ఏదైనా గాయమైతే కొద్ది సేపటికే అక్కడ రక్తం గడ్డ కట్టి కారిపోవడం ఆగిపోతుంది. ఒకవేళ గడ్డకట్టకపోతే గాయం నుంచి రక్తం ధారాపాతంగా కారిపోయి.. తీవ్ర పరిణామాలు తలెత్తే అవకాశం ఉంటుంది. మరి ఇలా రక్తం గడ్డకట్టడానికి తోడ్పడే అత్యంత ముఖ్యమైన సూక్ష్మ పోషకం విటమిన్ కె. అందుకే దీనిని ‘బ్లడ్ క్లాటింగ్ విటమిన్’ అంటారు. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. విటమిన్ కె1 ( ఫిలోక్వినోన్ ), విటమిన్ కె2 (మెనాక్వినోన్). ఎముకలు దృఢంగా ఉండడానికి విటమిన్ డి తోపాటు విటమిన్ కె కూడా అవసరం. కణజాలాల్లో అంతర్గత క్రియలకు కూడా ఇది తోడ్పడుతుంది. ఎ, డి విటమిన్ల తరహాలోనే ఇది కూడా కొవ్వుల ద్వారా అందే విటమిన్. 
సాధారణంగా మనకు అవసరమైన విటమిన్ కె లో చాలా వరకు మన పేగుల్లో ఉండే బ్యాక్టీరియా ద్వారానే తయారవుతుంది. పెద్ద వయసు వారికి రోజుకు 70 నుంచి 90 మైక్రోగ్రాముల వరకు విటమిన్ కె అవసరం. అయితే ఆయా వ్యక్తుల వయసు, బరువు, ఇతర కారణాలను బట్టి ఈ మోతాదు మారుతుంది. అమెరికా నేషనల్ హెల్త్ లైబ్రరీ, ఇంగ్లాండ్ నేషనల్ హెల్త్ సర్వీస్ ల లెక్కల ప్రకారం వ్యక్తుల శరీర బరువు ఒక్కో కిలోకు ఒక మైక్రోగ్రాము చొప్పున విటమిన్ కె అవసరం. ఉదాహరణకు 72 కిలోల బరువున్న వ్యక్తికి 72 మైక్రోగ్రాముల విటమిన్ కె అవసరం. సాధారణంగా అధికంగా తీసుకున్న విటమిన్ కె శరీరంలో నిల్వ అవుతుంది. అందువల్ల దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల పెద్దగా ప్రమాదాలేమీ లేవు. కానీ గుండె, రక్తనాళాల సంబంధిత సమస్యలు ఉన్నవారు, రక్తాన్ని పలుచన చేసే మందులు వినియోగిస్తున్నవారు విటమిన్ కె విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

లోపిస్తే ప్రమాదకరం.

సాధారణ వ్యక్తుల్లో విటమిన్ కె లోపం చాలావరకు తక్కువ. కానీ మారుతున్న ఆహార అలవాట్లు, జీవన విధానం దీని లోపానికి కారణమవుతోంది. దీనిని ‘విటమిన్ కె అంటగోనిజమ్’గా పిలుస్తారు. మన పేగుల్లో విటమిన్ కె ను తయారుచేసే బ్యాక్టీరియా తగ్గిపోవడం, అధికంగా యాంటీ బయాటిక్స్ వినియోగించడం, కొవ్వు పదార్థాలను జీర్ణం చేసుకోలేని రుగ్మతలు (ఫ్యాట్ మాల్ అబ్జార్ ప్షన్), సరైన ఆహారం తీసుకోకపోవడం, కాలేయ సమస్యలు విటమిన్ కె లోపానికి కారణమవుతాయి. ఇక గుండె, రక్తనాళాల సంబంధిత వ్యాధులున్నవారు రక్తాన్ని పలుచన చేసేందుకు ఉపయోగించే కొన్ని రకాల మందులు విటమిన్ కె పనితీరును దెబ్బతీస్తాయి. విటమిన్ కె లోపిస్తే గాయాలైనప్పుడు రక్తం గడ్డకట్టదు. దాంతో నిరంతరంగా రక్తస్రావం జరుగుతుంది. అంతేకాదు శరీరంలోని అంతర్గత అవయవాల చుట్టూ ఉండే పొర (మ్యూకోస్)ల్లో రక్త స్రావం జరిగే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల ఇన్ఫెక్షన్లు ప్రబలి మరణించే అవకాశాలు పెరుగుతాయి. గాయాల నుంచి సాధారణం కంటే అధికంగా రక్త స్రావం జరుగుతూ ఉంటే విటమిన్ కె లోపం ఉన్నట్లుగా గుర్తించవచ్చు. ఇక విటమిన్ కె ఉత్ప్రేరకంగా రక్తంలోకి విడుదలయ్యే ప్రొత్రాంబిన్ వంటి ప్రొటీన్ల స్థాయిలను పరిశీలించడం ద్వారా, సీరంలో విటమిన్ల స్థాయి పరీక్ష ద్వారా కూడా గుర్తించవచ్చు.

శిశువులకు చాలా అవసరం

అప్పుడే పుట్టిన శిశువులకు విటమిన్ కె అత్యవసరం. ఎందుకంటే తల్లి కడుపులో ఉండగా.. శిశువులకు విటమిన్ కె అందదు. తల్లి నుంచి బిడ్డకు అనుసంధానంగా ఉండే మాయ (ప్లెసెంటా) కొవ్వు పదార్థాలను, అందులో కరిగి ఉండే విటమిన్ కె ను రవాణా చేయనివ్వదు. దాంతో విటమిన్ కె నిల్వలేమీ లేకుండానే శిశువులు జన్మిస్తారు. దీంతోపాటు పుట్టిన కొద్ది రోజుల దాకా శిశువుల పేగుల్లో ‘సహ జీవన’ బ్యాక్టీరియా వృద్ధి చెందదు. తల్లి పాలలో కూడా విటమిన్ కె చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. మొత్తంగా శిశువులకు విటమిన్ కె అందని కారణంగా వారు పుట్టిన మొదటి రోజు నుంచి ఏడెనిమిది రోజుల లోపు రక్తస్రావ సమస్య ‘హెమరియేజిక్ డిసీజ్ (విటమిన్ కె డిఫిషియెన్సీ బ్లీడింగ్ - వీకేడీబీ)’ తలెత్తే అవకాశముంది. 
దీంతోపాటు కేవలం తల్లిపాలు పట్టడం, జీర్ణ సమస్యలు, కాలేయ సమస్యలు ఉన్న చిన్నారుల్లో రెండు నెలల వయసు వరకూ కూడా ఈ జబ్బు వస్తుంది. పలు సందర్భాల్లో పరిస్థితి విషమించి శిశువులు మృత్యువాత పడే ప్రమాదం ఉంది. అందువల్ల శిశువులకు పుట్టిన వెంటనే విటమిన్ కె ను నోటి ద్వారా చుక్కల రూపంలో అందజేస్తారు. శిశువులకు విటమిన్ కె లోపం ఉండే అవకాశమున్నందు వల్లే సాధారణంగా శిశువులకు ఇచ్చే మందులు, ఫార్ములాల్లో విటమిన్ కె కూడా ఒక సప్లిమెంట్ గా ఉంటుంది.

గుండె, రక్తనాళాల సమస్యలున్నవారు వేసుకోవద్దు..

గుండె, రక్తనాళాల సమస్యలతో బాధ పడుతూ రక్తాన్ని పలుచన చేసే మందులు వినియోగిస్తున్నవారు, అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నవారు, ఊబకాయులు, మధుమేహం ఉన్నవారు విటమిన్ కె విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. విటమిన్ కె మాత్రలు, విటమిన్ కె అదనపు సప్లిమెంట్ గా ఉన్న మాత్రలకు దూరంగా ఉండాలి. ఇది ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. ఇలాంటి వారికి విటమిన్ కె మోతాదు ఎక్కువగా అందితే అది రక్తం గడ్డకట్టడానికి దారితీసి.. గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు శరీరంలో ఇతర భాగాల్లోనూ రక్తనాళాలు దెబ్బతినవచ్చు కూడా. ఇలాంటి సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా నిపుణులైన వైద్యుల సలహా తీసుకుని, వారు సూచించిన మోతాదుల్లో మాత్రమే విటమిన్ కె ను తీసుకోవాలి.

తయారయ్యేది మన కడుపులోనే..

సాధారణంగా మనకు అవసరమైన విటమిన్ కె లో చాలా వరకు మన పేగుల్లో ఉండే కోలోనిక్ బ్యాక్టీరియా ద్వారానే తయారవుతుంది. ఇక బచ్చలి వంటి ఆకు కూరలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రాకొలీ, అవగాడో, ద్రాక్ష, సోయాబీన్, ఆలివ్ నూనె, మాంసం, పాలు, గుడ్లు, చేపలు, కాలేయం, తృణ ధాన్యాల్లో లభిస్తుంది.

పరిమితికి మించి వాడొద్దు

ఒక వేళ విటమిన్ కె మోతాదు ఎక్కువైతే పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పొట్ట తగ్గిపోవడం, నీరసం, ఊపిరి తీసుకోవడంలో సమస్యలు, శరీరంలో అక్కడక్కడా వాపు, నొప్పులు, కండరాలు పట్టేసినట్టుగా ఉండడం, కళ్లు, చర్మం పసుపు రంగులోకి మారడంతో పాటు అరుదుగా మింగడంలో సమస్యలు, ఛాతీ పట్టేసినట్లుగా ఉండడం, గుండె కొట్టుకునే వేగంలో తేడాలు, రక్తపోటు పడిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల వైద్యుల సలహా మేరకు మాత్రమే విటమిన్ కెను వాడడం శ్రేయస్కరం.representation image

విటమిన్ సి.. గుండెకు రక్ష

మన శరీరంలో కణాల పెరుగుదల, పునరుద్ధరణకు విటమిన్ సి అత్యవసరం. గుండెకు, రక్త కణాలకు ఇది ఎంతో మేలు చేస్తుంది. విటమిన్ సి రసాయనిక నామం ఆస్కార్బిక్ యాసిడ్. సాధారణంగా చెప్పాలంటే మనకు తరచూ వచ్చే రుగ్మత అయిన జలుబుకు కూడా విటమిన్ సి మంచి నిరోధకారి. శరీరంలో వివిధ కణజాలాలను పట్టి ఉంచే కొల్లాజెన్ అనే ప్రొటీన్ ఉత్పత్తికి విటమిన్ సి కీలకం. చర్మ కణాలు, రక్త నాళాలతో పాటు కండరాలు, ఎముకల మధ్య అనుసంధానం కల్పించే టెండాన్ లు, లిగమెంట్లు తయారు కావడానికి, దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఇది అవసరం. ఎర్ర రక్త కణాల తయారీకి అవసరమైన ఐరన్ ను ఆహారం నుంచి శరీరం సంగ్రహించడానికి విటమిన్ సి తోడ్పడుతుంది. ఇక అమెరికన్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం... కార్టిలేజ్ (మృదులాస్థి), ఎముకలు, దంతాలు దెబ్బతిన్నప్పుడు వాటిని పునరుద్ధరించడానికి, గాయాలు మానిపోవడానికి శరీరం విటమిన్ సి ని వినియోగించుకుంటుంది. 
కాలుష్యం, పొగతాగడం, అల్ట్రా వయోలెట్ (యూవీ) కిరణాల ప్రభావంతో శరీరంలో ఫ్రీ ర్యాడికల్స్ ఏర్పడడం కారణంగా వచ్చే సమస్యలను నియంత్రించి కేన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. అంతేగాకుండా వయస్సు మీద పడడం వల్ల వచ్చే మతిమరపు, దృష్టిలోపం వంటి సమస్యలను తగ్గించడంలో తోడ్పడుతుంది. ముఖ్యంగా విటమిన్ ఈ, బీటా కెరోటిన్ (విటమిన్ ఏ), జింక్ సప్లిమెంట్లతో కలిపి రోజుకు 500 మిల్లీగ్రాముల విటమిన్ సి తీసుకుంటే.. వారిలో వృద్ధాప్యంలో కండరాలు కుచించుకుపోవడాన్ని 25 శాతం వరకు, దృష్టి సమస్యలు ఏర్పడడాన్ని 19 శాతం తగ్గిస్తుందని అమెరికన్ నేషనల్ ఐ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇక ఎల్ డీ ఎల్ (బ్యాడ్) కొలెస్ట్రాల్ ను నియంత్రించడం ద్వారా రక్తనాళాలు గట్టిపడకుండా విటమిన్ సి సహాయపడుతుందని... తద్వారా గుండెపోటు వచ్చే ముప్పును తగ్గిస్తుందని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఆయా వ్యక్తుల వయస్సు, స్త్రీ పురుషులు, ఇతర అంశాల ఆధారంగా రోజువారీ విటమిన్ సి అవసరాల్లో మార్పులు ఉంటాయి. సాధారణంగా మహిళలకు రోజుకు 75 మిల్లీగ్రాములు, పురుషులకు 90 మిల్లీగ్రాములు విటమిన్ సి అవసరం. అదే గర్భిణులు, పిల్లలకు పాలిస్తున్న తల్లులకు 80 నుంచి 120 మిల్లీగ్రాముల వరకు అవసరం.

లోపిస్తే గాయాలు మానవు..

తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినే అలవాటు లేనివారిలో విటమిన్ సి లోపం కనిపిస్తుంది. అయితే విటమిన్ సి నీటిలో కరిగే విటమిన్. ఇది శరీరంలో నిల్వ ఉండదు. అందువల్ల ఎప్పటికప్పుడు విటమిన్ సి ఉండే ఆహారం తీసుకోవాల్సిందే. ఒకసారి ఎక్కువగా తీసుకున్నా కూడా మూత్ర పిండాల్లో వడపోతకు గురై మూత్రం ద్వారా బయటకు వెళ్లపోతుంది. అందువల్ల విటమిన్ సి లోపం చాలా మందిలో కనిపిస్తుంటుంది. ముఖ్యంగా సిగరెట్లు, బీడీలు, ఇతర పొగాకు ఉత్పత్తులను వినియోగించేవారికి విటమిన్ సి హెచ్చు మోతాదులో కావాల్సి ఉంటుంది. ఇక తీవ్ర జ్వరం, డయేరియా వంటి వాటి బారినపడినప్పుడు, ఏదైనా శస్త్రచికిత్స చేయించుకున్నవారికి, చర్మంపై కాలిన గాయాలైన వారికి కూడా విటమిన్ సి అవసరం ఎక్కువ. 
విటమిన్ సి లోపం వల్ల సాధారణంగా పిప్పిపళ్లు, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తం కారడం, చర్మం ఎండిపోయి పొలుసుల్లా ఏర్పడడం, వెంట్రుకలు పొడిబారిపోయి రాలిపోవడం, ముక్కు నుంచి రక్తం కారడం, ఇన్ఫెక్షన్లకు సులువుగా లోనుకావడం, గాయాలు మానడానికి ఎక్కువ కాలం పట్టడం, నీరసం, బలహీనత వంటి ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. అదే ఈ లోపం దీర్ఘకాలం పాటు ఉంటే స్కర్వీ వ్యాధి బారినపడే ప్రమాదం ఉంది. రక్తహీనత కూడా రావచ్చు. విటమిన్ సి లోపాన్ని రక్తంలో విటమిన్ సి స్థాయులను పరిశీలించడం ద్వారా గుర్తించవచ్చు.

పిల్లలు, వృద్ధులకు బాగా అవసరం

సాధారణంగా శిశువులకు విటమిన్ సి లోపం ఉండే అవకాశం తక్కువ. తల్లిపాల ద్వారా తగిన మోతాదులో అందుతుంది. కానీ తల్లిపాలు ఇవ్వడం ఆపేసిన తర్వాత చిన్నారుల్లో విటమిన్ సి లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. దీంతో స్కర్వీ అనే వ్యాధి బారిన పడవచ్చు. విటమిన్ సి లోపం ఉన్న పిల్లలు నడిచేటపుడు కాళ్లు విపరీతంగా నొప్పి పెడతాయి. సరైన స్థాయిలో బరువు పెరగరు. ఎముకల పెరుగుదల తగ్గిపోతుంది. రక్తస్రావం, రక్త హీనత తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఇక పెద్ద వయసు వారిలో కండరాలు కుచించుకుపోవడం, కీళ్ల నొప్పులు, బరువు తగ్గిపోవడం వంటి సమస్యలు ఉంటాయి. వృద్ధాప్యం లక్షణాలు వేగంగా ముసురుకుంటాయి.

పుల్లటి పదార్థాలేవైనా..

సహజ సిద్ధంగానే విటమిన్ సి లభించే అవకాశాలు చాలా ఎక్కువ. ముఖ్యంగా పుల్లగా ఉండే పండ్లు, కూరగాయల్లో ఇది విస్తృతంగా లభిస్తుంది. నారింజ, నిమ్మ, మామిడి, బొప్పాయి, జామ, ఫైనాపిల్, కివి, స్ట్రాబెర్రీ, పుచ్చకాయ, ఆకుకూరలు, మిరపకాయలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, టమాటా, బంగాళదుంప, బ్రాకొలీ, మొలకెత్తిన పప్పు ధాన్యాలు వంటివి విటమిన్ సి కి మంచి వనరులు. అయితే విటమిన్ సి అస్థిర పదార్థం. ఇది ఒక స్థాయికి మించి వేడిచేస్తే నశించిపోతుంది. అందువల్ల కూరగాయలనుగానీ, విటమిన్ సి ఉండే ఆహార పదార్థాలు వేటినిగానీ ఎక్కువగా ఉడికించకూడదు. వేపుళ్లు వంటివి చేస్తే విటమిన్ సి అసలు లభించదు.

ఎక్కువగా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు

విటమిన్ సి ని మోతాదుకు మించి తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. రోజులో 2 గ్రాములకు మించి తీసుకుంటే.. గుండె కొట్టుకునే వేగంలో తేడాలు, డయేరియా వంటివి వచ్చే ప్రమాదం ఉంది. మరికొందరిలో గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలు తలెత్తుతాయి.

ఇష్టం వచ్చినట్లుగా వాడితే ప్రమాదం

విటమిన్లు శరీరానికి ఎంతో అవసరమైనవే అయినా... వాటిని మోతాదుకు మించి తీసుకుంటే ప్రమాదం. ముఖ్యంగా మల్టీవిటమిన్ టాబ్లెట్లలో విటమిన్లతోపాటు ఐరన్, కాల్షియం, పొటాషియం, జింక్ వంటి సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి. వీటి పరిమితి మించితే దుష్పరిమాణాలు మరింత ఎక్కువగా ఉంటాయి. విటమిన్ మాత్రలు వినియోగిస్తున్నవారు కొన్ని లక్షణాల ఆధారంగా మోతాదులు మించినట్లు గుర్తించవచ్చు. ముఖ్యంగా తరచూ మూత్రానికి వెళ్లాల్సిరావడం, పెదవులు పగలడం, చర్మం ఎండిపోవడం, కళ్ల మంటలు, ఎక్కువ వెలుతురును చూడలేకపోవడం, గుండె వేగం పెరగడం, కీళ్లు, కండరాల నొప్పులు, బలహీనత, తలనొప్పి, వెంట్రుకలు రాలిపోవడం, రక్తంతో కూడిన విరేచనాలు, కడుపునొప్పి వంటి తలెత్తుతాయి. ఇటువంటి సమస్యలు తలెత్తినప్పడు కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి, ఏయే విటమిన్ మాత్రలను ఏయే మోతాదుల్లో, ఎంతకాలం నుంచి వినియోగిస్తున్నారో వివరించి తగిన చికిత్స చేయించుకోవాలి. అలాగాకుండా దీర్ఘకాలం పాటు విటమిన్ మాత్రలను వాడడం మంచిది కాదు.