Sunday, 12 March 2017

INDIAN NON VEG RECIPE 3 : పెప్పర్‌ చికెన్‌



    కావలసిన పదార్థాలు ఉల్లిపాయ ముక్కలు - 1 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 1 టే.స్పూను టమాటా ముక్కలు - 1 కప్పు మిరియాల పొడి - 1 టీస్పూను ఉప్పు - తగినంత కారం - అర టీస్పూను గరం మసాలా - అర టీస్పూను కరివేపాకు - 1 రెమ్మ షాజీరా - అర టీస్పూను యాలకులు - 2 దాల్చిన చెక్క - 1 అంగుళం లవంగాలు - 3 నూనె - 2 టీ.స్పూన్లు మారినేషన్‌ కోసం: చికెన్‌ - అర కిలో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 3/4 టీస్పూను పసుపు - పావు స్పూను ఉప్పు - కొద్దిగా తయారీ విధానం చికెన్‌ కడిగి పైన చెప్పిన పదార్థాల్లో మారినేట్‌ చేయాలి. బాండీలో నూనె పోసి షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి వేయించాలి. తర్వాత ఉల్లి ముక్కలు వేసి ఎర్రగా వేయించాలి.
    టమాటా ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. టమాటా మెత్తబడ్డాక కారం, గరం మసాలా వేసి, మిరియాల పొడి వేయాలి. నీరంతా ఇగిరిపోయేవరకూ వేయించాలి. తర్వాత చికెన్‌ ముక్కలు వేసి పెద్ద మంట మీద 3, 4 ని.లు వేయించాలి.

    తర్వాత మంట తగ్గించి ముక్కలు మెత్తగా ఉడికేవరకూ కలుపుతూ ఉండాలి. ఇలా 10 - 15 ని.లపాటు వేయిస్తే ముక్కలు పొడిగా తయారై బాగా వేగుతాయి. ప్లేట్‌లోకి తీసుకుని వేడిగా సర్వ్‌ చేయాలి. 

    No comments:

    Post a Comment